వరంగల్

జియోట్యాగింగ్ తప్పనిసరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్: హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటిన అనంతరం వాటిని ఖచ్చితంగా జియోట్యాగింగ్ చేయాలని రూరల్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవ న్ పాటిల్ అధికారులకు స్పష్టం చేసారు. జిల్లాపరిధిలోని కొన్ని ప్రాంతాల్లో మొక్కలు నాటిన అనంతరం జియోట్యాగింగ్ చేయటం లేదని తన దృష్టికి వచ్చిందని చెప్పారు. గురువారం తన కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో రూరల్ కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు హరితహారంలో భాగంగా మొక్కలు నాటగానే జియోట్యాగింగ్ చేసి ఆదే రోజు అటవీశాఖ వెబ్‌సైట్‌లో పొందుపరచాలని చెప్పారు. దీనివల్ల నాటిన ప్రతి మొక్కకు లెక్క ఉంటుందని, పర్యవేక్షణ సులభం అవుతుందని అన్నారు. వ్యవసాయశాఖకు నిర్ధేశించిన 16లక్షల మొక్కలను వెంటనే నాటేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శుక్రవారం జిల్లాలో హరితహారం ఎక్సైజ్ డే నిర్వహిస్తామని, ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా 35వేల మొక్కలను నాటుతామని తెలిపారు. నర్సంపేట నియోజకవర్గ పరిధిలోని దుగ్గొండి మండలం తిమ్మంపేట దామరకుంట చెరువు, వర్ధన్నపేట నియోజవర్గంలోని వర్ధన్నపేట కోనారెడ్డి చెరువు, పరకాల నియోజకవర్గంలోని ఆత్మకూరు మండలం కటాక్షాపూర్ చెరువు కట్టలపై మొక్కలు నాటుతామని తెలిపారు. ఎక్సైజ్ శాఖకు నాలుగు లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా ఇచ్చామని, ఈ లక్ష్యాలను వెంటనే పూర్తిచేయాలని చెప్పారు. జిల్లాలోని బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ శాఖలకు కేటాయించిన లక్ష్యాలను పూర్తిచేసారని చెబుతు ఈ మొక్కలకు సంబంధించిన జియోట్యాగింగ్‌ను వెంటనే పూర్తిచేయాలని సూచించారు. భూపంపిణీ పథకంలో భాగంగా మూడెకరాలలో బండ్ ప్లాంటేషన్ చేపట్టాలని, ఈ మేరకు రెండురోజుల్లో కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ఎస్సీ కార్పొరేషన్ ఇడిని కలెక్టర్ ఆదేశించారు. నర్సంపేట నగర పంచాయతీకి 50వేలు, పరకాల నగర పంచాయతీకి 30వేల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించామని కలెక్టర్ చెబుతు, వచ్చే సోమవారంలోగా వీటిని పూర్తిచేయాలని కమిషనర్లను ఆదేశించారు. కాగా హరితహారం కార్యక్రమం కింద నిర్ధేశించిన లక్ష్యాలను పూర్తిచేయటంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రూరల్ కలెక్టర్ ఆర్‌అండ్‌బి అధికారులకు స్పష్టం చేసారు. పదిరోజుల్లో ఎవెన్యూ ప్లాంటేషన్ పూర్తిచేయాలని చెప్పారు. మండలాల్లో ఇప్పటికే గుర్తించిన రహదారుల్లో రెండు, మూడు రహదారులను గుర్తించి ప్రతి మండలంలో నాలుగువేల మొక్కలు నాటాలని తెలిపారు. హరితహారం మొక్కలు నాటడంలో నాణ్యత పాటించాలని చెప్పారు.
సమావేశంలో జిల్లా వ్యవసాయశాఖ అధికారిణి ఉషాదయాల్, ఎస్సీ కార్పొరేషన్ ఇడి సురేష్, పంచాయతీ రాజ్ ఇఇ సంపత్‌కుమార్, ఆర్‌అండ్‌బి ఇఇ వెంకట్, మైనారిటీ సంక్షేమం అధికారి సర్వర్‌మియ, బిసి సంక్షేమ శాఖ అధికారి నర్సింహ్మస్వామి, గిరిజన సంక్షేమ అధికారిణి నిర్మల, ఎక్సైజ్ సిఐ కరంచంద్, వర్ధన్నపేట, నర్సంపేట, పరకాల ఎస్‌హెచ్‌ఓలు జగన్నాథరావు, కరుణశ్రీ, శశికుమారి , తదితరులు పాల్గొన్నారు.