విజయవాడ

కత్తిపోట్లకు రిక్షాపుల్లర్ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాయకాపురం: రాజరాజేశ్వరిపేటలో మరోసారి ఖల్‌నాయక్ బృందం క్రూరత్వాన్ని ప్రదర్శించారు. మద్యం మత్తులో విచక్షణా రహితంగా ఓ వ్యక్తిపై దాడి చేసి అతని మరణానికి కారకులయ్యారు. రాజరాజేశ్వరిపేటలో నివాసముంటున్న గంథసిరి వెంకటేశ్వర్లు రిక్షాపుల్లర్‌గా జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి ఏసు, సాయి అనే ఇద్దరు సంతానం ఉన్నారు. వీరుకూడా కూలి పనులకు వెళుతుంటారు. కాగా పనుల అనంతరం గురువారం సాయంత్రం స్థానిక రాజరాజేశ్వరిపేటలోని ఓ బార్‌లో మద్యం తాగేందుకు వెళ్లారు. ఈ క్రమంలో కట్టా వేణుగోపాలరావు అలియాస్ ఖల్‌నాయక్(రౌడీషీటర్) కొడుకులైన సోములు, కాలీ ఇదే బార్‌లో మద్యం కోసం వెళ్లారు. వీరుకూడా రౌడీషటర్లే. వీరిపై అనేక కేసులు నమోదై ఉన్నాయి. మద్యం కోసం వెళ్లిన వీరు ఏసు, సాయితో వాగ్వివాదానికి దిగారు. తొలుత వీరు చేతులతో దాడులు చేసుకున్నారు. అనంతరం సోములు తన తండ్రైన ఖల్‌నాయక్, ఇతర కుటుంబ సభ్యులకు జరుగుతున్న దాడి గురించి వివరించాడు. దీంతో హుటాహుటిన ఖల్‌నాయక్ కుటుంబ సభ్యులంతా అక్కడనున్న బార్ దగ్గరకు చేరుకుని ఏసు, సాయిలపై దాడికి దిగారు. అప్పటికే జరిగిన విషయాన్ని ఏసు, సాయిలు తమ తండ్రి వెంకటేశ్వర్లకు తెలిపారు. దీంతో అతను కూడా గొడవ జరిగే ప్రాంతానికి వచ్చాడు. గొడవ అడ్డుకునేందుకు ప్రయత్నించగా అప్పటికే ఖల్‌నాయక్ బృందం తనతో తెచ్చుకున్న కత్తులతో వెంకటేశ్వరరావుపై విచక్షణా రహితంగా దాడి చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అపస్మారక స్థితిలో ఉన్న వెంకటేశ్వర్లును ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందాడు. ఇదిలావుండగా దాడిలో పాల్గొన్న ఖాల్‌నాయక్, మరో నిందితుడు కాలీ పరారీలో ఉన్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఖల్‌నాయక్ కుమారుడు సోములు, మరో నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా నగర బహిష్కరణకు గురైన ఖల్‌నాయక్ ఈ మధ్యకాలంలో ఏలూరులో ఉంటూ ఇటీవల నగర బహిష్కరణ గడువు ముగియటంతో మళ్లీ నగరంలో ప్రవేశించినట్లు తెలుస్తోంది. మరోసారి ఇతనిపై నగర బహిష్కరణ విధించేందుకు పోలీసులు చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం.