శ్రీకాకుళం

హైవే విస్తరణకు సర్వే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం: రోజురోజుకూ వాహనాల రద్దీ పెరిగిపోవడం ప్రమాదాల సంఖ్య కూడా అడ్డూఅదుపు లేకుండా జాతీయ రహదారి వెంబడి చోటు చేసుకోవడాన్ని అధిగమించేందుకు హైవే విస్తరణ సంస్థ ఆరు వరుసల రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇందుకు అనుగుణంగా ఇప్పటికీ ఏయే ప్రాంతాల్లో ఎంతెంత భూమిని సేకరించాలి బైపాస్ రోడ్లు, ఫ్లై వోవర్‌లు ఎక్కడెక్కడ నిర్మించాలన్న కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది. ముఖ్యంగా జిల్లా పొడవున బైపాస్‌ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించి శ్రీకాకుళం, నరసన్నపేట, టెక్కలి తదితర ప్రాంతాల్లో ఆయా పట్టణాలను తప్పిస్తూ ఎడమ నుంచి వెళ్లేలా డిజైన్ చేసింది. అదే మాదిరీగా రణస్థలం, ఎచ్చెర్ల ప్రాంతాల్లో కుడి వైపు బైపాస్‌ను నిర్మించేలా సంబంధిత ఉన్నతాధికారులు సర్వం సిద్ధం చేశారు. దీనిపై రెవెన్యూ, సర్వే అధికార బృందాలు ఆయా పరిధిలో భూ సేకరణకు సర్వే ప్రక్రియ ప్రారంభించడంతో సంబంధిత రైతులు గందరగోళ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఇదిగో పులి అంటే అదిగో తోక అన్న చందంగా రూమర్లు పుట్టుకురావడంతో విలువైన భూములు కోల్పోతామన్న భయం అన్నదాతలను ఆందోలనకు గురి చేస్తుంది. మరికొన్ని చోట్ల ఇప్పటికే వ్యవసాయ భూములు రియల్ ఎస్టేట్‌లుగా రూపుదిద్దుకోవడంతో వాటిల్లో ప్లాట్‌లు దక్కించుకున్నవారు మరింత కలవరానికి గురౌతున్నారు. లక్షలాది రూపాయలు పెట్టి సొంతిల్లు నిర్మాణానికి కొనుగోలు చేసుకున్న ప్లాట్‌లను బైపాస్ నిర్మాణానికి హైవే అధికారులు సేకరించడాన్ని వారంతా దిగులు చెందుతున్నారు. పలు చోట్ల ఈ నిర్మాణంపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. రణస్థలం మండలం రావివలస, తాళ్లవలస, గరికపాలెం రెవెన్యూ పరిధిలో 66 ఎకరాలు, చిలకపాలెం, ఎచ్చెర్ల రెవెన్యూ పరిధిలో 88 ఎకరాలు సేకరించేందుకు అధికారులు భూసేకరణ సర్వే వేగవంతం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉండి అభివృద్ధి వైపు ఈ ప్రాంతం పరుగులు పెట్టడంతో సంబంధిత రైతులు ఇప్పటికే ఇళ్ల నిర్మాణాలకు కొనుగోలు చేసుకున్న వారు సైతం హడలెత్తిపోతున్నారు. భూసేకరణకు సంబంధించిన చర్చ రచ్చబండ వేధికల్లో తెలుసుకున్న రైతులు తహశీల్దార్ కార్యాలయం చుట్టూ పూర్తి సమాచారం కోసం చక్కెర్లు కొడుతున్నారు. అధికారులు మాత్రం ఇదంతా ఢిల్లీ స్థాయిలో నిర్వహిస్తున్నారని అక్కడ ఆదేశాల మేరకే జి పి ఎస్ విధానంలో భూసేకరణ సర్వే కొనసాగిస్తున్నామని సుస్పష్టంచేయడంతో రైతులు ఒకింత మనస్తాపానికి గురౌతున్నారు. 200 అడుగులు వెడల్పులో బైపాస్ నిర్మాణం రూపుదిద్దుకునేందుకు వీలుగా భూసేకరణ పనులు ముందుకు సాగడంతో అయోమయ పరిస్థితులను అన్నదాతలు ఎదుర్కొంటున్నారు. భూసేకరణ పనులు ప్రారంభించే ముందు ఆయా రెవెన్యూ గ్రామాలు రైతులతో అవగాహన కార్యక్రమం నిర్వహించి సందేహాలను నివృత్తి చేస్తే గ్రామాల్లో నెలకొన్న సమస్యలు ఓ కొలిక్కి వచ్చే అవకాశం లేకపోలేదు. ఇందుకు భిన్నంగా అధికారులు వ్యవహరించడం పట్ల రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఫ్లైవోవర్ నిర్మాణంపై పుకార్లు సికార్లు చేయడంతో ప్రధాన కూడళ్లవద్ద హైవేకు ఆనుకొని ఇళ్లు, వ్యాపార సముదాయాలు తొలగిస్తారా లేదా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. పైడి భీమవరం, రణస్థలం, సుభద్రాపురం, చిలకపాలెం, నవభారత్, బైపాస్ , ఆర్చ్ వంటి కూడళ్లవద్ద ఫ్లైవోవర్ నిర్మాణాలు హైవే అధికారులు చేపట్టేందుకు సన్నహాలు ప్రారంభించినట్లు ప్రచారం సాగుతుంది. ఫ్లైవోవర్ నిర్మాణానికి కొత్తగా భూమిని సేకరిస్తారా లేకుంటే ఇప్పటికే సేకరించిన భూమిని మార్కింగ్ గా చేసుకొని వీటిని నిర్మిస్తారా అన్న చర్చ కూడా సర్వత్రా నెలకొంది. ఇటువంటి అనిశ్చిత పరిస్థితులు హైవే విస్తరణ పనులకు ప్రతికూలంగా నిలిచే ప్రమాదం లేకపోలేదని మేధావులు సైతం తప్పుపడుతున్నారు. ఇదిలా ఉండగా ఇళ్లు కాలిపోతే నెయ్యిలేరుకున్న చంధంగా రియల్ ఎస్టేట్‌వ్యాపారులు ఖరీదైన కార్లు వేసుకొని రయ్ రయ్ మంటూ భూములు కొనుగోలుకు ఎగబడటం కనిపిస్తుంది. 200 అడుగులు బైపాస్ రోడ్డునకు ఆనుకొని ఉన్న వ్యవసాయ భూములను రైతుల నుంచి కొనుగోలు చేసేలా రెవెన్యూ అధికారులు రూపొందించిన మాస్టర్ ప్రింట్లను చేతబట్టి భూముల కొనుగోలుకు రంగంలోనికి దిగడం మరింత హాట్ హాట్ టాపిక్‌గా మారింది. భూములు కోల్పోతామన్న భయంతో రైతులు ఉండగా బైపాస్‌కు ఆనుకొని నేటి ధరలకు భూములు కొనుగోలు చేసి రియల్ ఎస్టేట్ రంగాన్ని పరుగులు పెట్టించేందుకు రియాల్టర్లు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. పెద్దనోట్ల రద్దుతో కుదేలైన రియల్ ఎస్టేట్ వ్యాపారులు బైపాస్ రోడ్డును క్యాష్ చేసుకునేలా లావాదేవీలు నెరిపేందుకు సిద్ధమవడం కన్పిస్తుంది. ఆగస్టు 1 తరువాత భూములు మార్కెట్ విలువ ప్రభుత్వం పెంచేందుకు ఇప్పటికే సర్వం సిద్ధం చేయడాన్ని ఆసరాగా తీసుకొని రియాల్టర్లు హైవే విస్తరణలో భాగంగా భూములు ధరలకు రెక్కలొచ్చేలా వ్యాపారాలు నిర్వహించి రియల్ ఎస్టేట్ రంగం జోరందుకునేలా పావులు కదుపుతున్నారు. హైవే విస్తరణ పనులు ఓ కొలిక్కి వచ్చేవరకు ఉత్కంఠ వీడేటట్టు లేదు.

అభివృద్ధిపై చర్చకు సిద్ధం

కోటబొమ్మాళి: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన జరిగిన అభివృద్ధిపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై చర్చకు రావడానికి ఎక్కడికైనా సిద్ధమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. కోటబొమ్మాళిలో శుక్రవారం 40 లక్షల రూపాయలతో సీతంపేట గిరిజనాభివృద్ధి సంస్థ ద్వారా రక్షిత మంచినీటిపథకం, మూడు రచ్చబండలు, రెండు సామాజిక భవనాలకు శంకుస్థాపన, కొత్తమ్మతల్లి ఆలయానికి కోటి రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన, 53 లక్షల రూపాయలతో ఐసిడి ఎస్ భవనం ప్రారంభం, రెండు అంగన్‌వాడీ భవనాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను నేరవేర్చామని, ఇంకా రెండు సంపూర్ణ గృహనిర్మాణ పథకం, నిరుద్యోగ భృతి వంటి కార్యక్రమాలు మిగిలి ఉన్నాయని, అవి కూడా త్వరలో అమలు చేయడానికి రూపకల్పన చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలపై ప్రతిపక్షాలకు విమర్శించడానికి ఏది దొరకకపోవడంతో కులాల మధ్య చిచ్చుపెడుతూ కాపు ఉద్యమాన్ని తెరపైకి తెస్తున్నారని విమర్శించారు. ముద్రగడ పద్మనాభం కాంగ్రెస్ హయాంలో గాని, గత ఎన్నికలలో జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన మ్యానిఫెస్టోలో కాపు రిజర్వేషన్ లేదని, అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదని మంత్రి స్పష్టం చేసారు. 13 శాతం ఉన్న కాపులను బిసిలో చేర్చడానికి సి ఎం సుముఖంగా ఉన్నారన్నారు. ప్రతి ఎకరానికి తాగునీరు ఖచ్చితంగా అందిస్తానని, వచ్చే ఎన్నికల నాటికి ఏ ఎకరానికి నీరు అందకపోయినా ప్రజలు ప్రశ్నించవచ్చునన్నారు. నియోజకవర్గంలో టెక్కలి, కోటబొమ్మాళి, సంతబొమ్మాళి మండలాల్లో రోడ్లు విస్తరణకు ప్రజలు ఎంతో సహకరించారన్నారు. వారి సహకారంతో రోడ్లు నిర్మాణం చేపడుతున్నామన్నారు. ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్డు, గ్రామానంతరం వెళ్లడానికి తారురోడ్డును నిర్మించడమే లక్ష్యమన్నారు. చంద్రన్న బీమా పథకాన్ని సి ఎం మరో అడుగు ముందుకు వస్తే సాధారణ మరణానికి 2 లక్షల రూపాయలు చెక్కును ఇచ్చే విధంగాకార్యాచరణ రూపొందిస్తున్నారన్నారు. కోటబొమ్మాళి మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. జిల్లా పరిషత్ ఛైర్మన్ చౌదరి ధనలక్ష్మి, మండల టిడిపి అధ్యక్షుడు బి.రమేష్, ఎంపిపి రామకృష్ణ, జడ్‌పిటిసి పద్మశ్రీనివాస్, జి.బీమారావు, కృష్ణమూర్తి, పిడి లీలావతి, దేవాదాయశాఖ ఇ ఇ శేఖర్, ఉపకమిషనర్ మూర్తి, నాగయ్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

‘బెల్టు’ తీయరు!

ఆమదాలవలస: ఈ ఏడాది ఎక్సైజ్‌శాఖ కొత్తగా విధించిన బెల్టుషాపు రద్దు ఉత్తర్వులు కాగితాలకే పరిమితం అవుతున్నాయి. పట్టణంలోనూ, పరిసర గ్రామాల్లోని పురవీధుల్లో బెల్టుషాపులు విచ్ఛలవిడిగా వెలుస్తూ నిబంధనలకు విరుద్ధంగా మద్యం దుకాణాల నిర్వహణ ఎక్సైజ్ విభాగం ఉత్తర్వులను నవ్వులపాలు చేస్తున్నాయి. బెల్టుషాపులు నిర్వహిస్తే కఠినమైన శిక్షలు విధిస్తామని సంబంధిత విభాగం ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినప్పటికీ వీటిని అమలుచేసే అధికారులు, సిబ్బంది కొందరు మద్యం వ్యాపారులతో దోస్తీ చేసి వీరు ఇచ్చే ముడుపులు తీసుకొని చాటుమాటుగా బెల్టును ప్రోత్సహిస్తూ చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో కఠినంగా అమలు చేయాల్సిన ఎక్సైజ్ విభాగం ఆదేశాలు క్షేత్ర స్థాయిలో నీరుగారుతున్నాయి. పట్టణంలోని ఏడు మద్యం దుకాణాల్లో 3మద్యం దుకాణాలతో పాటు అనుమతి ఉన్న ఒక బారు నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం సాగిస్తున్నట్లు సమాచారం. పర్మిట్‌రూమ్‌లకు అనుమతి లేకపోయినా ఆయా దుకాణాలు ప్రక్కన డేరాలు కట్టి దర్జాగా లూజు అమ్మకాలు సాగిస్తున్నారు. ఇక్కడి రైల్వే స్టేషను ప్రక్కన గల ఒక బారు నిర్వహణకు మేడపైన అనుమతి ఉన్నప్పటికీ అందుకు విరుద్ధంగా ప్రధాన రహదారి ప్రక్కన భవనం దిగువన నిర్వహిస్తూ నిబంధనలకు నీళ్లువదులుతున్నారు. మండలంలోని తోటవాడ పంచాయతీ కొత్తరోడ్డు వద్ద సుమారు 30 బెల్టుషాపులు రాత్రిపగలు తేడా లేకుండా విక్రయాలు సాగిస్తున్నారు. కొత్తరోడ్డు పరిధిలోగల దూసి మద్యం దుఖాణాన్ని తెరవెనుక ఉంటూ బినామీ పేరుతో కళాశాల లెక్చరర్ నిర్వహించడం సిగ్గుచేటు. ఇప్పటికైనా సంబందిత విభాగం ఉన్నతాధికారులు స్పందించి మద్యం దుఖాణాల్లో ఎం.ఆర్.పి. ధరలను, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించి పెట్రేగిపోతున్న మద్యం విక్రయదారులను అదుపులోకి తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

విశాఖలో దంపతుల ఆత్మహత్య

విశాఖపట్నం: కుటుంబ కలహాలు కారణంగా భార్యా భర్తలు ఆత్మహత్యకు పాల్పడటంతో వారి ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. విశాఖ నగరంలోని పోతినమల్లయ్యపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని మారికవలస శారదానగర్‌లో శుక్రవారం సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో జరిగిన ఈ విషాధ సంఘటనకు సంబంధించి పోలీసులు, స్థానికులు చెప్పిన వివరాలు ఇలా వున్నాయి. శ్రీకాకుళం జిల్లా రాజాం సమీపంలోని తాళాడకు చెందిన బి.అప్పలరాజు తాపీపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతని మొదటి భార్య ఝాన్సీ గతంలో రోడ్డు ప్రమాదంలో మృతిచెందింది. వారికి అభిలాష్, దినేష్ ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. కాగా అప్పలనాయుడు గత ఆరు నెలల క్రితం హైదరాబాద్‌కు చెందిన ఇదివరకే వివాహమై తొమ్మిదేళ్ల శిరిష అనే కుమార్తె ఉన్న రమాదేవిని వివాహమాడాడు. శుక్రవారం సాయంత్రం స్కూల్ నుండి ఇంటికి వచ్చిన తన కుమార్తె శిరిషను రమాదేవి పిలిచి బాగా చదువుకోమని, తనలా కాకుండా మంచి వ్యక్తిని వివాహం చేసుకోవాలని, లేకపోతే వివాహం చేసుకోవద్దని హితబోధ చేసి ఇంటి అరుగుమీద కూర్చొని హోమ్‌వర్క్ చేసుకోమని చెప్పి అప్పలనాయుడు, రమాదేవిలు ఇంట్లోకి వెళ్లి తలుపులు వెసుకున్న కొద్దిసేపటికీ శబ్ధం వినిపించి శిరిష తలుపులు తట్టగా తెరుచుకోలేదు. దాంతో స్థానిక యువకులు ఇంటి కిటికీ తలుపులు తెరిచి చూడగా దంపతులు మృతిచెంది ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు సిఐ లక్ష్మణమూర్తి సిబ్బందితో చేరుకుని తలుపులు తెరిచి చూడగా అప్పలనాయుడు ఫేన్ హుక్‌కు తాడుతో ఉరివేసుకుని వేలాడుతూ ఉండగా, రమాదేవి మెడకు తాడు ఉండి నేలపై పడి ఉండడాన్ని పోలీసులు గమనించారు. వెంటనే పోలీసుల సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న క్లూస్ టీం అక్కడి ఆధారాలను పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కెజిహెచ్‌కు తరలించారు. కుంటుంబ కలహాలే దంపతుల అత్మహత్యకు కారణమై ఉంటుందని, పోస్టుమార్టం నివేదిక వచ్చిన పిమ్మట పూర్తి వివరాలు తెలుస్తాయని సిఐ తెలిపారు.
శతశాతం భూ రికార్డుల నవీకరణ
నరసన్నపేట: జిల్లాలో ప్రభుత్వ సహకారంతో భూ రికార్డులన్నీ నవీకరణం చేసేందుకు గాను కృషి చేయడం జరుగుతుందని నియోజకవర్గ ప్రత్యేకాధికారి, డి ఆర్ డి ఏ పిడి కిషోర్‌కుమార్ తెలిపారు. శుక్రవారం మండలంలోని కోమర్తి పంచాయతీలో నిర్వహించిన రైతు సేవలో రెవెన్యూ శాఖ కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రతీ వారం గురువారం శుక్రవారం రోజులలో ఆయా పంచాయితీల్లో భూ రికార్డులకు సంబంధించి రైతుల సమస్యలను పరిష్కరించే దిశగా ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. ఇటీవల కొన్ని పంచాయతీల్లో నిర్వహించిన ఈ కార్యక్రమం 90శాతం మేర ఫలితాలను సాధించుకోగలిగామని ఆమె వివరించారు. ఏది ఏమైనప్పటికీ రైతులు తమ భూముల వివరాలపై ఉన్న సమస్యలను పై కార్యక్రమంలో పరిష్కరించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ జె.రామారావు, సర్పంచ్ జగన్నాధం, ఎంపిటీసీ సూర్యనారాయణ, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
బిజెపి నగర కమిటీ ఏర్పాటు
శ్రీకాకుళం(రూరల్): బిజెపి నగర పార్టీ కార్యవర్గ కమిటీని శుక్రవారం నగర అధ్యక్షుడు చల్లా వెంకటేశ్వరరావు ప్రకటించారు. స్థానిక ఎన్జీవో హోమ్‌లో జరిగిన సమావేశంలో జిల్లాకు చెందిన పార్టీ, రాష్ట్ర, జిల్లా నాయకుల సమక్షంలో జరిగిన సమావేశంలో నగర పతాధికారులను , నగరకార్యవర్గ సభ్యులను మోర్చాల అధ్యక్షులను ప్రకటించి వారిచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఉపాధ్యక్షులుగా ఎల్.ఖగేశ్వరరావు, భోగాపురం గురునాధం, చింతపల్లి దుర్గారావుగాంధీ, దయాసాగర్, తనికెళ్ల కృష్ణమూర్తిలను ప్రధాన కార్యదర్శులుగా అల్లు మల్లేశ్వరరావు, కాకర్ల వెంకటభానూజీ, సంపతిరావు రాజులను, కార్యదర్శులుగా తాళ్లూరు విజయలక్ష్మణ్, వడ్డి మురళీమోహనరావు, పాలిశెట్టి రాధాకృష్ణ,మొదలవలస గోవిందరావు, టి.రాజేశ్వరీలను, కోశాధికారిగా పేర్ల మహేష్, మహిళా మోర్చా నగర అధ్యక్షురాలిగా గంగు శ్రీదేవిని, ఎస్సీ మోర్చా అధ్యక్షునిగా రుప్ప రమేష్‌బాబులను నియమించారు. అలాగే కార్యవర్గ సభ్యులుగామరో 50మందిని ప్రకటించారు. కార్యక్రమంలో చల్లా వెంకటేశ్వరరావు, బిజెపి రాష్ట్ర కార్యదర్శి పైడి వేణుగోపాలం, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు పూడి తిరుపతిరావు, జిల్లా అధ్యక్షుడు, కోటగిరి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.
దేవీ ఆశ్రమంలో ప్రత్యేక పూజలు
ఎచ్చెర్ల:మండలంలోని కుంచాలకూర్మయ్యపేటలో గల ఏకోత్తర సహస్ర శ్రీచక్ర మేరువుల దేవీ ఆశ్రమంలో శ్రావణమాసం మొదటి శుక్రవారాన్ని పురష్కరించుకొని మూలవిరాట్‌కు ఆశ్రమవ్యవస్థాపకులు తేజోమూర్తుల భాలభాస్కరశర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తుల సందర్శనార్థం అమ్మవారి నిజరూప దర్శనం కల్పించారు. క్షీరాభిషేకం, చందనం, కుంకుమ, పసుపు, విభూది జలాలతో పాటు ఔషద జలాభిషేకాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి పుష్పాలంకరణ సాగించారు. భక్తులతో లలిత పారాయణం, ఖడ్గమాల, గురుపాదాస్తక పఠనం చేయించారు. మూలవిరాట్‌కు అమ్మవారి వద్ద ఉన్న శ్రీచక్రమేరువులకు కుంకుమార్చనలు నిర్వహించారు. భక్తులకు తీర్థప్రసాదాలు అనంతరం అనుగ్రహ భాసణ కల్పించారు. ఆగస్టు 7న శ్రావణ పౌర్ణమి నాడు కుంకుమార్చనలు ఉదయం 9గంటలనుండి ప్రారంభం అవుతుందని అదే రోజు చంద్రగ్రహణం కనుక మధ్యాహ్నం 12గంటలకు ఆలయం మూసివేయడం జరుగుతుందని స్పష్టంచేశారు. భక్తులందరూ సాంప్రదాయ దుస్తులు ధరించి శ్రావణ మాస పూజల్లో పాల్గొవాలని కోరారు.
హైవే కూడళ్లలో హెచ్చరికల బోర్డులు
ఎచ్చెర్ల: జాతీయ రహదారిపై ప్రమాదాలు నివారించేందుకు ప్రధాన కూడళ్లలో నోపార్కింగ్ పేరిట హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేసేలా అధికారులు స్థల పరిశీలన సాగిస్తున్నారు. శుక్రవారం చిలకపాలెం కూడలిలో అనధికార పార్కింగ్ వాహనాలను మున్ముందు పెట్టకుండా ఆ స్తలాన్ని ఖాళీ చేయించేలా బోర్డులు ఏర్పాటునకు సన్నహాలు మొదలుపెట్టారు. హైవేకు ఆనుకొని అనధికారికంగా వాహనాలను పార్కింగ్ చేస్తే రూ.5వేలు జరీమానా చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేసేలా పోలీసు, ఆర్టివో అధికారులు సంయుక్తంగా చర్యలు చేపడుతున్నారు. ఏ ఏ వలస, చిలకపాలెం, ఎచ్చెర్ల, కేశవరావుపేట జంక్షన్ , నవభారత్, బైపాస్, ఆర్చ్, సీపన్నాయుడుపేట కూడళ్లవద్ద ఈ బోర్డులు ఏర్పాటు చేసేలా సర్వం సిద్ధం చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ఇటువంటి సంస్కరణలను చేపడుతున్నట్లు జె ఆర్ పురం సి ఐ వై.రామకృష్ణ పేర్కొన్నారు.
ధాన్యలక్ష్మీ అవతారంలో విజయదుర్గమ్మ
శ్రీకాకుళం(రూరల్): శ్రీ విజయదుర్గ అమ్మవారి శ్రావణమాస పూజామహోత్సవాల్లో భాగంగా శుక్రవారం ధాన్యలక్ష్మీదేవి అవతారంలో విజయదుర్గ అమ్మవారిని అలంకరించారు. అష్టలక్ష్మీ అవతారాల్లో భాగంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉదయం 6గంటల నుండి 7:30 గంటల వరకు అమ్మవారికి పాలతో అభిషేకం జరిపారు. ఆలయ అర్చకులు ఆరవెల్లి సూర్యనారాయణశర్మ, ఫణికుమార్‌శర్మలు పూజలు నిర్వహించారు. శ్రావణమాసం మొదటి శుక్రవారం కావడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. అలాగే ఏడురోడ్ల కూడలిలో ఉన్న దుర్గాలయంలో కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరడం కనిపించింది. నగరంలో ఉన్న పలు దుర్గాలయాల్లో భక్తులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ‚
సెస్ బకాయిలు తక్షణమే చెల్లించాలి
శ్రీకాకుళం(రూరల్): సెస్ బకాయిలను తక్షణమే చెల్లించాలని జెసి-2 పి.రజనీకాంతారావు స్పష్టంచేశారు. జిల్లా గ్రంథాలయ సంస్థ సెస్ రివ్యూ కమిటీ సమావేశాన్ని జెసి ఛాంబర్‌లో జెసి-2 అధ్యక్షతన జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని పంచాయతీలు గ్రంధాలయ సంస్థ బకాయిలు తక్షణం జిల్లా గ్రంధాలయ సంస్థకు చెల్లించాలని ఆదేశించారు. ఈ మేరకు పంచాయతీని, మున్సిపాలిటీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రంధాలయ అభివృద్ధికి సెస్ అవసరమని దీనికి ప్రతీ ఒక్క అధికారి శ్రద్ద తీసుకొని జమ చేయాల్సిందిగా సూచించారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ పీరుకట్ల విఠల్‌రావు, కార్యదర్శి సత్యన్నారాయణ, డి ఎల్ పివో రామ్‌ప్రసాద్, పలాస ,కాశీబుగ్గ కమీషనర్ పి.జగన్మోహనరావు, ఆమదాలవలస మేనేజర్ కె.శ్రీనివాసరావు, పాలకొండ కమీషనర్ బాలాజీ ప్రసాద్, డి ఎల్ పివో (పాలకొండ) సత్యన్నారాయణ, శ్రీకాకుళం డి పివో కార్యాలయం తరఫున పి.దివాకర్‌రావు, రాజాం, ఆమదాలవలస కమీషనర్ బి.రాము తదితరులు పాల్గొన్నారు.

పేటలో డెంగ్యూ కలకలం

నరసన్నపేట: ఇటీవల వాతావరణంలో పెను మార్పులు చోటు చేసుకోవడంతో దోమల బారి నుండి బయటపడేందుకు అవస్థలు పడుతున్న సమయంలో నరసన్నపేటలో డెంగ్యూతో ఒకరు బాధ పడుతున్న సంఘటన చోటు చేసుకుంది. నరసన్నపేటలో నివాసం ఉంటున్న తర్ర రాజశేఖర్‌కు డెంగ్యూ వ్యాధి సోకినట్లుగా నిర్ధారణ అయ్యింది. ఈమేరకు విశాఖ కెజిహెచ్‌లో రక్త పరీక్షలు నిర్వహించగా ఈ వ్యాధి ఉన్నట్లు అక్కడి వైద్యులు స్పష్టంచేశారు. దీనిపై సమాచారం అందుకున్న మాకివలస వైద్యాధికారి అప్పలనాయుడు బాధితుని ఇంటివద్దకు వెళ్లి వివరాలను అడిగి తెలుసుకున్నారు. డెంగ్యూకు ముఖ్యంగా ఆయన నివాసం ఉంటున్న ప్రాంతంలో దోమల బెడద ఎక్కువగా ఉన్నట్లు పారిశుద్ధ్యం లోపం కూడా కనిపిస్తుండటంతో దీని వలనే ఈవ్యాధి వచ్చినట్లుగా గుర్తించామని తెలిపారు. ముందస్తు జాగ్రత్త చర్యలుగా ఆయన కుటుంబ సభ్యుల రక్తనమూనాలను కూడా సేకరించామని వీటిని పరీక్షల నిమిత్తం పంపడం జరుగుతుందని వివరించారు. దీనిపై మండలంలోని పలు పంచాయితీలలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడమే కాకుండా పారిశుద్ధ్యంపై దృష్టి సారించే విధంగా అధికారులు సహకరించాలని ఆయన కోరారు. దీనితోపాటు సూపర్‌వైజర్లు ఎల్.రామ్‌కుమార్, ఆరోగ్య సహాయకులు నాగభూషణరావు తదితరులు పాల్గొన్నారు.

మామిడిజోలపై గజరాజుల దాడి

సారవకోట: మండలంలోని భద్రి పంచాయితీ మామిడిజోల గిరిజన గ్రామంపై శుక్రవారం రాత్రి ఏనుగులు దాడి చేసాయి. దీంతో గ్రామంలో ఉన్న గిరిజనులు భయభ్రాంతులై ప్రాణాలు అరచేత పట్టుకొని చిమ్మ చీకట్లో సమీపంలో గల జమినివలస గ్రామానికి వెళ్లి తలదాచుకున్నారు. వంశధార కాలువను దాటి మామిడిజోల చేరుకున్న ఏనుగులు నాలుగు పురిపాకలను పూర్తిగా ధ్వంసం చేసాయి. ఆహార ధాన్యాలను తినివేసాయి. ఇండ్లలో గల సామాగ్రి ఏనుగుల కాళ్లుకిందపడి పూర్తిగా పాడైపోయాయి. ఏడాది కిందట తాండ్రమానుగూడ, రేగిడి గూడ, ఒళ్ళుమామిడి గూడా, అంటికొండ గ్రామాల నుండి 16 గిరిజన కుటుంబాలు వలస వచ్చి ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. ఈ గ్రామంలో 68మంది జనాభా ఉన్నారు. గ్రామంలో నివసించడానికి ప్రస్తుతం ఈ గిరిజనులు ఇష్టపడడం లేదు. అటవీశాఖాధికారులు వచ్చి ఏనుగుల బారి నుండి ఏ విధంగా రక్షించుకోవాలో వీరికి వివరించారు. బీట్ అధికారి కేశవరావు ఏనుగుల ట్రాకర్లు లక్ష్మణరావు, చిరంజీవి గిరిజనులకు ధైర్యం చెప్పారు. ప్రస్తుతం ఈ ఏనుగులు ఆశోకం కొండపై మకాం పెట్టాయి. ఈ గ్రామానికి చెందిన సవరరాజయ్య, భోగేసు, మంగయ్య, చినబాలెమ్మ, ప్రసాద్ తదితరులు ఏనుగుల దాడి చేసిన సంఘటన వివరాలను తెలియజేసారు. ఏనుగుల బారి నుండి గిరిజనులను కాపాడుతామని, అయితే గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని ఏనుగులను రెచ్చగొట్టే చర్యలు చేయకూడదని రేంజ్ అధికారి సోమశేఖర్ సూచించారు.