బృందావనమది అందరిది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రచయితగా పలు చిత్రాలకు పనిచేసిన శ్రీ్ధర్ శీపానను దర్శకుడిగా పరిచయం చేస్తూ జస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ క్రియేషన్స్ పతాకంపై శ్రీనివాస్ వంగల నిర్మిస్తున్న చిత్రం ‘బృందావనమది అందరిది’. ఈ సినిమా టైటిల్ లోగో ఆవిష్కరణ కార్యక్రమం శనివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో దర్శకుడు శ్రీ్ధర్ శీపాన పుట్టిన రోజు వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు వై.వి. ఎస్.చౌదరి, అనీల్ సుంకర, రామిరెడ్డి, కోన వెంకట్, ఆనంద్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వై.వి.ఎస్.చౌదరి మాట్లాడుతూ- రైటర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీ్ధర్ ఈ సినిమాతో దర్శకుడిగా మారుతున్నాడు. తను మెలోడీ డ్రామా ఎమోషన్స్ డైలాగ్స్ రాయడంలో దిట్ట. ఈ సినిమా టైటిల్ చాలా ఆహ్లాదకరంగా వుంది. దానికితోడు మణిశర్మ సంగీతం తోడైంది. దాంతో ఈ సినిమా ఏ రేంజ్‌లో వుంటుందో ఊహించుకోవచ్చు. తప్పకుండా ఈ సినిమా ఘనవిజయం సాధించాలన్నారు. అనీల్ సుంకర మాట్లాడుతూ- పలు చిత్రాలకు రచయితగా పనిచేసిన శ్రీ్ధర్ దర్శకుడిగా మారుతూ చేస్తున్న ఈ చిత్రం మంచి విజయం సాధించాలన్నారు. దర్శకుడు శ్రీ్ధర్ శీపాన మాట్లాడుతూ- నా స్నేహితుడు రామిరెడ్డి కోసమే ఈ సినిమా చేయడానికి నిర్ణయించుకున్నాను. నన్ను నమ్మి ఈ సినిమా చేస్తున్న నిర్మాత శ్రీనివాస్‌గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నాం అన్నారు. ఈ చిత్రానికి సంగీతం మణిశర్మ, కెమెరా:ఎం.ఎస్.తేజ, ఎడిటర్:ప్రవీణ్ పూడి, నిర్మాత:శ్రీనివాస్ వంగల, దర్శకత్వం:శ్రీ్ధర్ శీపాన.