చాన్స్ ఇస్తాడా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రామ్‌చరణ్ నటిస్తున్న రంగస్థలం 1985 హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా కోసం వేసిన భారీ సెట్‌లో షూటింగ్ జరుపుతున్నారు. ఈ సినిమా తరువాత తదుపరి చిత్రం కోసం రామ్‌చరణ్ కూడా గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు. ఇప్పటికే పలువురు దర్శకులతో కథా చర్చలు జరుపుతున్న చరణ్‌తో సినిమా చేయడానికి మరో దర్శకుడు కూడా ఆసక్తిని చూపిస్తున్నారు. తాజాగా గౌతమ్‌నంద సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న సంపత్‌నంది, మరోసారి చరణ్ కోసం ఓ కథను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన రచ్చ చిత్రం సంచలన విజయాన్ని అందుకుంది. ఆ తరువాత సంపత్‌నంది దర్శకుడిగా సినిమాలు చేస్తూనే మరోవైపు నిర్మాతగా కూడా అభిరుచి గల చిత్రాల్ని నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం చరణ్ కోసం ఆయన ఎదురుచూస్తున్నట్టు తెలిసింది. గౌతమ్‌నంద సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో చరణ్ కూడా ఆసక్తి చూపిస్తున్నట్టు సమాచారం.