అంతర్జాతీయం

వెనక్కి తగ్గలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 2: వివాదాస్పద డోక్లామ్ ప్రాంతంనుంచి భారత్ తన సైనిక దళాలను తగ్గించుకోలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. భారత్ తన సైన్యాన్ని కొంతమేర వెనక్కి తీసుకుందంటూ చైనా ప్రకటించిన నేపథ్యంలో ఈ మేరకు అధికార వర్గాలు సమాచారాన్ని వెల్లడించాయి. గత నెల 18నుంచి డోక్లామ్‌కు సంబంధించి ఇరు దేశాల మధ్య ప్రతిష్టంభన నెలకొనడంతో రెండు దేశాలు సమాన సంఖ్యలో ఇరువైపులా సైన్యాన్ని మోహరించిన విషయం తెలిసిందే. చైనా ప్రకటన నేపథ్యంలో వాస్తవాన్ని వెల్లడించిన భారత వర్గాలు దాదాపు 400మంది భారత సైనికులు ఇప్పటికీ డోక్లామ్ ప్రాంతంలో ఉన్నారని వెల్లడించాయి. చైనా తాజాగా జారీచేసిన ప్రకటనలో భారత దళాలు 400 నుంచి 40కి తగ్గిపోయాయని, జూలై చివరి నాటికే ఈ పరిణామం చోటుచేసుకుందని స్పష్టం చేసింది. మొత్తం పదిహేను పేజీల వాస్తవ నివేదికను చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. జూన్ 18 నాటికి 270మంది భారత సైనికులు ఆయుధాలు, రెండు బుల్‌డోజర్లతో డొక్లామ్ వద్ద సిక్కిం సెక్టార్ సరిహద్దు దాటారని తెలిపింది. ఆ విధంగా దాదాపు వందమీటర్ల తమ భూభాగంలోకి చొచ్చుకువచ్చి చైనా తన ప్రాదేశిక ప్రాంతంలో నిర్మిస్తున్న రహదారిని అడ్డుకోవడానికి ప్రయత్నించారని, దానివల్లే ఈ సమస్య అంతా తలెత్తిందని చైనా విదేశాంగ శాఖ పేర్కొంది. ఈ ప్రకటనను ఖండించిన భారత్ డోక్లామ్‌లో తన సైనిక దళాలను తగ్గించుకోలేదని స్పష్టం చేయడమే కాక శాంతియుతంగా ఈ సమస్యను పరిష్కరించుకోవాలన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ఉండాలంటే సరిహద్దు ప్రాంతంలో శాంతి, ప్రశాంతత అవసరమని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.