ఓయూ జార్జిరెడ్డి కథతో...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వంగవీటి సినిమా హీరో శాండి, దళం దర్శకుడు జీవన్‌రెడ్డి, ఇటీవలికాలంలో 100 కోట్లు వసూలు చేసి దేశంలో సంచలనం సృష్టించిన మరాఠి చిత్రం సైరత్ కెమెరామెన్ సుధాకర్ ఎక్కంటి క్రేజీ కాంబినేషన్‌లో ఓ భారీ బయోపిక్ నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు జార్జ్‌రెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందిస్తున్నారు. త్వరలో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ చిత్రంలో వంగవీటి సినిమా కథానాయకుడు శాండి జార్జ్‌రెడ్డి పాత్రలో కన్పించనున్నాడు. ఈ సందర్భంగా దర్శకుడు జీవన్‌రెడ్డి మాట్లాడుతూ- 1962నుండి 72 దాకా విద్యార్థి రాజకీయాలు, ఆనాటి సమాజిక, ఆర్థిక రాజకీయ పరిస్థితులు యూనివర్సిటీ పరిణామాలు జార్జ్‌రెడ్డి జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. హైదరాబాద్, వరంగల్, కేరళ, ఔరంగాబాద్, ముంబాయి, పూనె తదితర ప్రాంతాల్లో షూటింగ్ చేయనున్నామని, భారీ బడ్జెట్‌తో తెలుగు చిత్రాలలోనే డిఫరెంట్ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ సినిమాలో ప్రముఖ తెలుగు నటులతోపాటు హిందీ, తమిళ, మలయాళ నటులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ బయోపిక్‌ను రెండు ప్రధాన సంస్థలు నిర్మిస్తున్నాయి. చిత్రానికి సంబంధించిన టైటిల్‌ను, ఫస్ట్‌లుక్‌ను త్వరలో విడుదల చేయనున్నారు.