సహజ కథనంతో సువర్ణసుందరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాక్షీ చౌదరి, పూరణ్, రామ్ ప్రధాన తారాగణంగా ఎస్ టీమ్ పిక్చర్స్ పతాకంపై సూర్య దర్శకత్వంలో ఎం.ఎల్.లక్ష్మి రూపొందిస్తున్న చిత్రం ‘సువర్ణసుందరి’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్‌లకు మంచి స్పందన లభిస్తోందని దర్శక నిర్మాతలు తెలియజేస్తున్నారు. దర్శకుడు సూర్య మాట్లాడుతూ- సూపర్ నేచురల్ కథనంతో థ్రిల్లింగ్‌గా ఈ చిత్రం సాగుతుందని, 1509లో జరిగే కథనంతో ప్రారంభమై నేటివరకూ నాలుగు శతాబ్దాలలో జరిగే కథనం ఇదని తెలిపారు. ఆయా కాలాలనుబట్టి వేరు వేరు ప్రాం తాలలో షూటింగ్ చేశామని, బెం గళూరు, హైదరాబాద్, అనంతపూర్, కలకత్తా, కేర ళ, బీదర్ తదితర ప్రాంతాల్లో చేసిన షూటింగ్ ఔట్‌పుట్ బాగా వచ్చిందని తెలిపారు. చరిత్రలో బయటికి రాని, చీకటి కోణాలను ఈ సినిమాలో వైవిధ్యంగా ఆవిష్కరిస్తున్నామని, అలాంటి చీకటి కోణాలు అనేక రకా ల జనరేషన్స్‌పై ఎలాంటి ప్రభావాన్ని చూపించింది అన్నదే ప్రధాన కధాంశమని ఆయన తెలిపారు. ప్రస్తుతం సిజి కార్యక్రమాలు జరుగుతున్నాయని, హై క్వాలిటీ విజువల్స్ తో రూపొందించిన ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తయిందని, త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని వివరించారు.