ఉయ్యాలవాడలో కన్నడ స్టార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పొరుగు హీరోలు తెలుగు భాషలో విలన్ ప్రయోగాలు చేయడం కొత్తేమీ కాదు. పొరుగు భాషల్లోని స్టార్ హీరోలను విలన్ పాత్రలకు ఒప్పించడానికి తెలుగు దర్శకులు ఒకింత ఎక్కువగానే దృష్టి పెడుతున్నారు. ఆశించినట్టుగానే విలన్ పాత్రలతో మెప్పించిన హీరోలూ ఎక్కువుగానే ఉన్నారు. చాలాకాలం క్రితమే కన్నడ స్టార్ హీరో సుదీప్‌ను ‘ఈగ’ చిత్రంలో విలన్‌గా ప్రజెంట్ చేసి మెప్పించాడు రాజవౌళి. అలా తెలుగు ప్రేక్షకులకు చేరువైన కిచ్చ సుదీప్‌కి కన్నడలో భారీ ఫాలోయింగ్ ఉన్నా, తెలుగులోనూ అదేస్థాయి ఫాలోయింగ్‌ను క్రియేట్ చేసుకుంటున్నారు. ఇప్పుడీ స్టార్ హీరో చిరంజీవి కొత్త సినిమా ఉయ్యాలవాడ నరసింహారెడ్డిలో భాగమవుతున్నట్టు సమాచారం. కొణిదెల ప్రొడక్షన్స్‌తో రామ్‌చరణ్ నిర్మాతగా భారీ బడ్జెట్‌తో సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. సినిమాలో బాలీవుడ్ వెటరన్ స్టార్ అమితాబ్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం ఉంది. అలాగే స్టార్ హీరోయిన్‌గా హవా కొనసాగిస్తున్న నయనతార సైతం సినిమా కోసం రెడీ అవుతోంది. భారీ కాస్టింగ్‌లో భాగంగా చిత్ర యూనిట్ ఓ ముఖ్యమైన, వైవిధ్యమైన పాత్ర కోసం సుదీప్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. అదే జరిగితే సినిమా రేంజ్ నేషనల్ స్థాయికి వెళ్లిపోయినట్టేనని ఇండస్ట్రీలో వినిపిస్తోంది.