ఏదైనా ఓకె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమా అవకాశాలు వచ్చినంతకాలం ఓకె. రాకపోతే ఏంటి పరిస్థితి? అని ఆలోచించే నటీనటులు కొందరే ఉంటా రు. అటువంటివారిలో ముందు వరుసలో ఉంటుంది నటి సమంత. ప్రస్తుతం ఆమె రంగస్థలం చిత్రానికి సంబంధించిన షూటింగ్‌లో బిజీగా ఉంది. ఇప్పటికే నాగచైతన్యతో నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. అయితే తన తోటి కథానాయికలందరూ ఏదోక వ్యాపారాలు మొదలుపెడుతుండటంతో తానూ ఓ దుకాణం తెరిచే ప్రయత్నంలో ఉందట. షూటింగ్‌లో బిజీగావుంటూనే మరోప్రక్క ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలకు ప్రమోషన్ కూడా చేస్తోంది. తన స్నేహితులతో కలిసి ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించే కంపెనీని ప్రారంభించింది. ఇప్పటికే చేనేత పరిశ్రమకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది సమంత. తనకు ఇలాంటి సేవా కార్యక్రమాలపై ఎన్నో ఆశలు ఉన్నాయని, పెళ్లి చేసుకొని పరిశ్రమను వదిలి వెళ్లిపోయాక మంచి కార్యక్రమాలు చేయాలన్న కోరికవుందని చెబుతోంది. మొత్తానికి ప్రతిభవుంటే ఒక్క సినిమా రంగమే కాదు, ఏ రంగంలోనైనా సత్తా చాటవచ్చని సమంత నిరూపిస్తోంది.
కీపిటప్..!