ఇక.. అమ్మగా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోర్న్ స్టార్ ఇమేజ్‌తో సినీరంగ ప్రవేశం చేసినా, ఆ ముద్రను వదిలించుకుని ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న నటి సన్నీలియోన్. బ్లూ స్క్రీన్ నుంచి సిల్వర్ స్క్రీన్‌కు వచ్చిన తరువాత ఆమె దృష్టి అంతా బాలీవుడ్‌పైనే వుండటం విశేషం. పోర్న్‌స్టార్ అంటూ ఎక్కడైతే తనగురించి మాట్లాడారో, అక్కడే మంచి నటిగానూ పేరు తెచ్చుకోవాలని ఆశిస్తోంది సన్నీ. అలాంటి సన్నీ, ఈమధ్య రెండేళ్ల పాపను దత్తత తీసుకుంది. నిషా పేరున్న పాపను దత్తత తీసుకోవడానికి అనేకమంది అనాథాశ్రమానికి వచ్చినా చివరికి ఎవరూ తీసుకోలేదట. ఆ పాప రంగు, కుటుంబ చరిత్ర తెలుసుకుని వెళ్లిపోయారు కానీ, ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో పాప దత్తత కార్యక్రమం ఆగిపోయింది. ఈ నేపథ్యంలో పాప గురించి ఎలాంటి విషయాలు తెలుసుకోకుండా ఒక్కసారిగా అనాథాశ్రమానికి వెళ్లి ఎటువంటి ప్రశ్నలు అడగకుండా పాపను దత్తత తీసుకుని తల్లిగా మారింది సన్నీ. మీడియాలో ఆమెకున్న ఇమేజ్‌కు ఆమెలోవున్న మాతృత్వ వ్యక్తిత్వానికి అసలు పొంతనే లేదని, ఆశ్రమ నిర్వాహకులు ఆమెను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అందంతోపాటు ఆమెలో అమ్మ కూడా ఉందని, గొప్ప మానతావాదిగా సన్నీకి కితాబిస్తున్నారు. బ్లూ, సిల్వర్ స్క్రీన్‌లపై ఇమేజ్ మాటేమోగానీ, లైఫ్ స్క్రీన్‌మీద మాత్రం సన్నీకి గొప్ప ఇమేజ్ వచ్చేసింది. ఇది ఆశించి ఆమె చిన్న పాపను దత్తత తీసుకోకపోయినా, ఇప్పటి వరకూ పోర్ట్‌స్టార్ అంటూ మాట్లాడిన వాళ్లు మాత్రం ఈ సన్నివేశంతో ఆ మాట అనడానికి సాహసం చేయలేకపోతున్నారు. కంటేనే అమ్మ అని అంటే ఎలా.. అంటూ ఓ సినీకవి రాసిన అమ్మ అర్థానికి అచ్చమైన ఉదాహరణగా నిలిచిందన్న ప్రశంస అందుకుంటోంది సన్నీ.