మాస్ పవర్ షురూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సర్వేశ్వర మూవీస్ పతాకంపై శివ జొన్నలగడ్డ కథానాయకుడిగా గుద్దేడి బసవప్ప మేరు రూపొందిస్తున్న చిత్రం ‘మాస్ పవర్’. ఈ చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం హైదరాబాద్ ఫిలిం చాంబర్ హాల్‌లో జరిగింది. తొలి సన్నివేశంపై సారేపల్లి కొండలరావు క్లాప్‌నివ్వగా, తుమ్మలపల్లి రామసత్యనారాయణ కెమెరా స్విచ్చాన్ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు, కథానాయకుడు శివ జొన్నలగడ్డ మాట్లాడుతూ ఓ కాలనీలో ఫామ్‌హౌస్‌ను రాజకీయ నాయకుడు ఆక్రమిస్తే ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయనే కథనంతో పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌గా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు తెలిపారు. పక్కా పవర్‌ఫుల్ మాస్ అంశాలున్న పాకేజీ మూవీగా సినిమా రూపుదిద్దుకుంటోందని, ఐదు ఫైట్లు, పాటలను కంపోజ్ చేసుకున్నామని నిర్మాత బసవప్ప తెలిపారు. ఈనెల 10 నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి వీలైనంత త్వరగా సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు ఆయన చెప్పారు. ప్రియచైతన్య కథానాయికగా నటిస్తున్న చిత్రానికి కెమెరా కె.శివ, కథ, మాటలు, సంగీతం, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం శివా జొన్నలగడ్డ.