ఇదో కిడ్నాప్ డ్రామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మధురం మూవీ క్రియేషన్స్ పతాకంపై శ్రీకర్‌బాబు దర్శకత్వంలో మాధవి అద్దంకి రూపొందిస్తున్న చిత్రం ‘నేను కిడ్నాప్ అయ్యాను’. చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. బ్రహ్మానందం, తా.రమేశ్, పోసాని కృష్ణ మురళి ఫ్రధాన తారాగణంగా నటించిన చిత్రానికి క్లీన్ యు సర్ట్ఫికెట్ లభించింది. ఈనెల రెండోవారంలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మాధవి అద్దంకి మాట్లాడుతూ సినిమాకు సంబంధించిన తొలి కాపీ సిద్ధమైందని, సెన్సార్ మంచి కాంప్లిమెంట్ ఇవ్వడంతో విజయంపై ధైర్యం పెరిగిందన్నారు. కామెడీ హైలెట్‌గా సాగుతుందని సినిమా నిర్మించినట్టు చెప్పారు. అవుట్‌పుట్ బాగా రావడంతో సంతోషంగా ఉన్నామని, మేజర్ పాయింట్ సినిమా కామెడీతో సాగుతుందని రఘుబాబు, కృష్ణ భగవాన్, పృధ్విల హాస్యం సరికొత్తగా ఉంటుందని దర్శకుడు శ్రీకర్‌బాబు అన్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలతో రూపొందిన చిత్రం త్వరలోనే ఫ్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు ఆయన తెలిపారు.