కొత్తగా ఉంటుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జయ జానకీ నాయక చిత్రం ఫస్ట్ఫా హార్ట్ టచింగ్ లవ్‌స్టోరీతో సాగుతుంది. సెకండాఫ్‌లో పదునైన కథనంతో సాగుతూ కొత్త టేస్ట్ అందిస్తుంది. వైవిధ్యమైన జోనర్‌లో వస్తున్న సినిమా ప్రేక్షకులకు తప్పక నచ్చుతుంది’ అని హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ తెలిపారు. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం జై జానకీ నాయక. ఈనెల 11న విడుదల కానున్న చిత్రం గురించి హీరో చెప్పిన విశేషాలు ఆయన మాటల్లోనే. ‘జయ జానకీ నాయక అంటే లంకలో సీతాదేవిని గెలుచుకున్న శ్రీరాముడు అని అర్ధం. ఈ చిత్రంలో లంక ఏమిటో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. విలనిజాన్ని పీక్స్‌కు తీసుకెళ్లిన జగపతిబాబు, ఈ సినిమాతో వైవిధ్యమైన విలనిజాన్ని మరో మెట్టు ఎక్కించారు. ఓ మంచి ప్రేమ కథను కమర్షియల్ ఎలిమెంట్స్‌తో మిక్స్‌చేసి రూపొందించిన ఈ చిత్రంలో కథనం రేర్‌గా జరుగుతుంది. నా మూడో చిత్రానికే ఇలాంటి కథ కుదరడం హ్యాపీగా ఉంది. సినిమాలో నేను కొత్తగా కనిపిస్తాను. నా బాడీ లాంగ్వేజీలో మార్పు ఉంటుంది. డాన్స్‌లపరంగా, యాక్షన్ సన్నివేశాల కోసం శిక్షణ తీసుకున్నాను. స్పీడున్నోడు పరాజయం నన్ను ఇబ్బంది పెట్టింది. రకుల్‌ప్రీత్ సింగ్, సమంత, జగపతిబాబు, శరత్‌బాబు లాంటివాళ్లు మంచి నటులు కావడంతో వాళ్లఎదుట చేసేటప్పుడు మరింత బాగా చేయాలనిపిస్తుంది. క్యాథరిన్ స్పెషల్ సాంగ్, ప్రగ్యా జైస్వాల్ చేసిన మరో పాత్ర సినిమాకు ప్లస్‌గా మారతాయి. శ్రీవాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నా. ఇప్పటి వరకు టాలీవుడ్‌లోరాని డిఫరెంట్ జోనర్ ఇది. మంచి కథలుంటేనే సినిమా చేయాలనుకుంటున్నా. ఈనెల 15నుండి శ్రీవాస్ రూపొందించే సినిమాకు సంబంధించిన రెండో షెడ్యూల్ ప్రారంభం కానుంది’.