నా పాత్రకూ ప్రాముఖ్యత ఉంటేనే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యూత్ స్టార్ నితిన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో 14 రీల్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘లై’ (లవ్ ఇంటిలిజెన్స్ ఎనిమిటి). ఈనెల 11న సినిమా విడుదలవుతున్న సందర్భంలో తెలుగు తెరకు పరిచయమవుతోన్న మేఘా ఆకాష్ చెప్పిన విశేషాలు.
బాల్యమంతా చెన్నైలోనే. విజువల్ కమ్యూనికేషన్‌లో డిగ్రీ చేశా. గౌతమ్ మీనన్ సినిమా చేస్తున్న సమయంలో వచ్చిన చాన్స్‌తో ఇలా స్క్రీన్‌కు వచ్చా.
లైలో ఉత్సాహంగా, హుషారుగా ఉండే చైత్ర పాత్రలో కనిపిస్తా. నిజంగా రియల్ లైఫ్‌కి భిన్నమైన పాత్ర. పాటలతో ఎంత అలరిస్తానో, పాత్రపరంగానూ అంతే ప్రాముఖ్యత ఉంటుంది.
హీరో నితిన్‌తో చేయడం బాగుంది. తనకు ఓపిక ఎక్కువ. చాలా విషయాలు వివరించేవాడు. ఎంతో కష్టపడినా, అతని సరదాతో ఆ ఫీలే కలగలేదు.
దర్శకుడు హనుతో పనిచేయడం ఎగ్జైటింగ్‌గా అనిపించింది. ఆయన వర్కింగ్ స్టైలే డిఫరెంట్. కాన్ఫిడెంట్‌గా సన్నివేశాన్ని వివరించేవాడు.
తెలుగులో పవన్‌కళ్యాణ్ అంటే ఇష్టం. త్రిష, అలియాభట్‌లూ ఇష్టమే.
ఈ సినిమా తరువాత తమిళంలో గౌతమ్‌మీనన్- ధనుష్‌ల కాంబినేషన్‌లో ‘ఎన్నై నోకి పాయుం తూటా’, ‘ఒరుపక్కా కత్తి’ చిత్రాల్లో నటిస్తున్నా.