ఈసారి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న సప్తగిరి, సప్తగిరి ఎక్స్‌ప్రెస్ చిత్రంతో హీరోగా మంచి మార్కులు తెచ్చుకున్నాడు. తాజాగా ఆయన హీరోగా నటిస్తున్న మరో చిత్రం సప్తగిరి సూపర్‌ఫాస్ట్. ఈ చిత్రం శనివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు కిరణ్ క్లాప్‌కొట్టగా రచయిత విజయేంద్రప్రసాద్ కెమెరా స్విచ్చాన్ చేశారు. సీనియర్ దర్శకుడు బి.గోపాల్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ద్వారా నట్టి కరుణ, నట్టి క్రాంతి నిర్మాతలుగా పరిచయం అవుతున్నారు. నట్టీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై హర్షవర్థన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ- హర్షవర్థన్ నా చిరకాల మిత్రుడు. నాతో కలిసి చాలా సినిమాలకు పనిచేశాడు. ఈ కథను సిద్ధం చేసి నాకు వినిపించి నా అనుమతి తీసుకున్నాడు. సప్తగిరికి వందశాతం సూట్ అయ్యే కథ ఇది అని అన్నారు. హీరో సప్తగిరి మాట్లాడుతూ- పెద్దల సమక్షంలో సినిమా ప్రారంభమవ్వడం ఆనందంగా ఉంది. మంచి కంటెంట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తప్పకుండా మంచి విజయం అందాలని కోరుకుంటున్నానన్నారు. చిత్ర దర్శకుడు హర్షవర్థన్ మాట్లాడుతూ- చాలా గ్యాప్ తరువాత ఈ సినిమా చేస్తున్నాను. అందరికీ నచ్చే కథాంశమిది. ఈ సినిమాతో సప్తగిరి మరో మెట్టు పైకెక్కే విధంగా వుంటుంది. కొత్త నిర్మాతలు మంచి తపనతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ- మా నాన్నగారు మమ్మల్ని ఈ రంగంలో ప్రోత్సహిస్తున్నందుకు ఆనందంగా వుంది. మా ప్రయత్నాన్ని అందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నామన్నారు. చిత్రానికి ఎడిటింగ్:గౌతంరాజు, ఫైట్స్:రామ్‌లక్ష్మణ్, దర్శకత్వం:హర్షవర్థన్.