లవకుశ క్రేజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న జైలవకుశ సినిమాకు సంబంధించిన రోజుకో వార్త ప్రేక్షకుల్లో హైప్‌ను క్రియేట్ చేస్తోంది. మూడు పాత్రల్లో ఎన్టీఆర్ నట విశ్వరూపాన్ని ప్రదర్శించనున్న ఈ చిత్రానికి బాబి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ప్రేక్షకులతోపాటు ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాల్ని నెలకొల్పిన ఈ చిత్రం తాజాగా సీడెడ్ విడుదల హక్కుల్ని భారీ ధరకు అమ్ముడవ్వడం విశేషం. ఎన్టీఆర్ కెరీర్‌లో భారీ రేటు పలికిన హక్కులు ఇవే. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని దసరాకు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈనెల 7న మరో టీజర్‌ను విడుదల చేస్తారట. దాంతోపాటు ఎన్టీఆర్ హోస్ట్‌గా నిర్వహిస్తున్న బిగ్‌బాస్ షో కూడా మంచి క్రేజ్‌ను తెచ్చుకోవడంతో ఎన్టీఆర్ హవా మామూలుగాలేదు.