అంత రిస్కా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హీరో మంచు మనోజ్ ప్రస్తుతం ‘ఒక్కడు మిగిలాడు’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఇందులో మనోజ్ ఎల్‌టిటిఇ చీఫ్ ప్రభాకరన్ పాత్రతోపాటు, స్టూడెంట్ లీడర్ పాత్ర చేస్తుండటం వలన సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. చిత్ర టీమ్ కూడా రియాలిటీకి దగ్గరగా ఉండేలా సన్నివేశాల్ని రూపొందించినట్టు వినికిడి. ఇటీవలే సముద్రం నడిబొడ్డున 10మందితో ఒక రెస్క్యూ సన్నివేశాన్ని చిత్రీకరించారట. ఈ సీన్ సినిమాలో 40 నిముషాలపాటు ఇంటెన్స్ డ్రామాతో నడుస్తుందట. ఈ విషయాన్ని మనోజ్ స్వయంగా వెల్లడించాడు. అలాగే సన్నివేశంలో తాను నటించలేదని, వేరే 10మంది నటించారని, అంత కష్టమైన వాతావరణంలో నటించిన టీమ్‌కు సెల్యూట్ అని కూడా అన్నారు. రెజీనా, అనీషా ఆంబ్రోస్ హీరోయిన్లుగా నటించిన చిత్రాన్ని అజయ్ ఆండ్రూస్ నూతక్కి డైరెక్ట్ చేస్తుండగా ఎస్‌ఎన్ రెడ్డి నిర్మిస్తున్నారు. చిత్రం
ఎప్పుడు విడుదలవుతుంది, ఆడియో,
ట్రైలర్ ఎప్పుడు అనే విశేషాలు
త్వరలోనే తెలియనున్నాయి.