అంతర్జాతీయం

చైనాలో భారీ భూకంపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, ఆగస్టు 8: చైనాలోని సిచువాన్ రాష్ట్రంలో మంగళవారం రాత్రి సంభవించిన భారీ భూకంపంలో వంద మందికి పైగా చనిపోగా, వేలాది మంది గాయపడినట్లు తెలుస్తోంది. రిక్టర్ స్కేలుపై 6.5 పాయింట్ల తీవ్రత ఉన్న ఈ భూకంపం స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 9.20 గంటల సమయంలో సంభవించింది. ఈ భూకంపంలో అయిదుగురు చనిపోగా, 60 మందికి పైగా గాయపడ్డారని, క్షతగాత్రుల్లో 30 మంది పరిస్థితి విషమంగా ఉందని అధికార జిన్హువా వార్తాసంస్థ తెలిపింది. అయితే వందమందికి పైగానే చనిపోయి ఉంటారని చైనా జాతీయ డిజాస్టర్ రిడక్షన్ కమిషన్ అంచనా వేసింది.
మారుమూల పర్వత ప్రాంతం అయిన రాష్ట్రంలో ప్రాథమిక సమాచారం ప్రకారం భూకంపం కారణంగా లక్షా 30 వేలకు పైగా ఇళ్లు దెబ్బతిన్నాయని కూడా కమిషన్ పేర్కొంది. 2008లో వచ్చిన భూకంపమే తనకు ఇప్పటివరకు తెలిసిన అతి పెద్ద భూకంపమని, ఇప్పుడు వచ్చింది అంతకన్నా తీవ్రంగా ఉందని జియుఝాయ్‌గౌ పట్టణంలో ఓ రెస్టారెంట్ యజమాని అయిన తాంగ్ షెషెంగ్ అనే మహిళ చెప్పింది. దెబ్బతిన్న భవనాలు కూలిపోతాయన్న భయంతో చాలా మంది ఇళ్లలోంచి బైటికి వచ్చి పట్టణంలోని అతిపెద్ద స్క్వేర్ వద్దనే రాత్రంతా కూర్చుని ఉన్నారని ఆమె చెప్పారు. ప్రాణాలు దక్కితే చాలని భావించిన జనం విలువైన వస్తువులు, బట్టలులాంటివి తీసుకోవడానికి కూడా వెళ్లడం లేదని ఆమె చెప్పారు. కాగా, ఈ భూకంపం కేంద్రం రాష్ట్ర రాజధాని చెంగ్డుకు 264 కిలోమీటర్ల ఉత్తరంగా ఉందని, భూమిలోపల పది కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించిందని అమెరికా జియాలజికల్ సర్వే కేంద్రం తెలిపింది.

చిత్రం.. భూకంపంతో నేల కూలి చెట్టు