అఖిల్ రంగులరాట్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్కినేని వారసుడు అఖిల్ రెండవ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటోంది. తొలి చిత్రం ‘అఖిల్’ విజయం సాధించకపోవడంతో తన తనయుడికి ఎలాగైనా హిట్ ఇవ్వాలని నాగార్జునే స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎలాంటి కథనైనా తనదైన శైలిలో సరళంగా వెండితెరపై చూపించగలిగే విక్రమ్ కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలు పెద్దగా బయటకు రావడంలేదు. కాగా చిత్ర టైటిల్‌కు సంబంధించిన అనేక వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. నాగార్జున సూపర్‌హిట్ సాంగ్ ‘హలో గురూ ప్రేమకోసమేరా’, ‘మజ్ను’ వంటి టైటిల్స్ వినిపించాయి. తాజాగా మరో ఆసక్తికరమైన టైటిల్ అఖిల్ చిత్రానికి ఫిక్స్ అయిందంటూ వార్తలు వస్తున్నాయి. ‘రంగులరాట్నం’ అనే టైటిల్‌ని అన్నపూర్ణ స్టూడియో బ్యానర్‌పై ఫిలిం ఛాంబర్‌లో రిజిస్టర్ చేసినట్టు తెలుస్తోంది. దీనితో ఇదే అఖిల్ సినిమా టైటిల్ అని అంతా అనుకుంటున్నారు. ఏదేమైనా ఈ అచ్చ తెలుగు టైటిల్ గురించి అధికారిక ప్రకటన రావాల్సిఉంది.