నెలాఖరు నుంచి ఆకలిరాజ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆనంద్, కావ్యశ్రీ, అంజలి, జబర్దస్త్ ఆది, షేకింగ్ శేషు ప్రధాన తారాగణంగా భాగ్యలక్ష్మి ఆర్ట్స్ పిక్చర్స్ పతాకంపై శ్రీ్భగ్య దర్శకత్వంలో మంజుల భాగ్యలక్ష్మి, ఎం శ్యామల సంయుక్తంగా రూపొందించనున్న చిత్రం ‘నేటి ఆకలిరాజ్యం’. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈసందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ- ఈ నెలాఖరు నుంచి సినిమా షూటింగ్ ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. నేటి యువత పట్టుదలతో కృషి చేసి ఏకాగ్రతతో ఉంటే అనుకున్నది సాధించగలరన్న ప్రధానమైన పాయింట్‌ను సినిమాలో చూపించబోతున్నట్టు చెప్పారు. అలాగే, స్నేహ సంబంధాలు మర్చిపోయి కేవలం డబ్బు ప్రధానం అనుకునే యువత స్నేహం విలువ ఎలా తెలుసుకుంది అన్న కథనాన్ని వైవిధ్యంగా చూపించబోతున్నట్టు చెప్పారు. కొత్త నటులతోపాటు దాదాపు 20మంది సీనియర్లు నటిస్తున్నారని, ఓ మంచి చిత్రాన్ని అందించబోతున్నట్టు తెలిపారు. చిత్రానికి కెమెరా రామ్ పినిశెట్టి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం శ్రీ్భగ్య.