రీ రికార్డింగ్‌లో స్పైడర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహేష్‌బాబు, ఎఆర్ మురుగదాస్ కాంబినేషన్‌లో ఎన్‌విఆర్ సినిమా, ఎల్‌ఎల్‌పి, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై ఎన్‌వి ప్రసాద్ రూపొందిస్తున్న చిత్రం ‘స్పైడర్’. చిత్రానికి సంబంధించిన టీజర్‌కు, పోస్టర్‌కు మంచి అప్లాజ్ లభిస్తోంది. మహేష్‌బాబు పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన పోస్టర్, టీజర్ సినిమా అంచనాలను పెంచుతున్నాయని నిర్మాతలు చెబుతున్నారు. ఇంకా ఎన్‌వి ప్రసాద్ మాట్లాడుతూ ఒక్క పాట వినా షూటింగ్ పార్ట్ పూరె్తైందన్నారు. ప్రస్తుతం రీ రికార్డింగ్ జరుపుతున్నామని చెప్పారు. మిగిలిన పాట ఈనెల 23 వరకు షూటింగ్ చేస్తామని, దాంతో టోటల్‌గా సినిమా పూర్తవుతుందని, అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి దసరా కానుకగా సెప్టెంబర్ 27న తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నామని తెలిపారు. రకుల్ ప్రీత్‌సింగ్ కథానాయికగా నటిస్తున్న చిత్రంలో ఎస్‌జె సూర్య కీలక పాత్రలో కనిపించబోతున్నారు. చిత్రానికి సంగీతం హారిస్ జైరాజ్, కెమెరా సంతోష్ శివన్ అందిస్తున్నారు.