అదిలాబాద్

సరస్వతి కాలువతో భూములను సస్యశ్యామలం చేస్తాం: కెసిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మల్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన కాలువలతోపాటు నిర్మల్ జిల్లాకు సాగునీటిని అందించే సరస్వతి కాలువ ద్వారా పూర్తిస్థాయిలో ఆయకట్టు భూములకు సాగునీటిని అందించి సస్యశ్యామలం చేస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. గురువారం నిర్మల్ జిల్లా సరిహద్దులోని శ్రీరాంసాగర్ పునరుజ్జీవన పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన భారీ బహిరంగసభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ గత ఆంధ్రా పాలకుల నిర్లక్ష్యం కారణంగా తెలంగాణలోని ప్రధాన ప్రాజెక్టులన్నీ నిర్జీవంగా మారాయన్నారు. సాగునీటి రంగాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల కాలువల్లో పిచ్చిమొక్కలు మొలిచి ఎందుకూ పనికిరాకుండా పోయాయన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యతనిచ్చి కోటి ఎకరాలను సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఇందులో భాగంగానే దాదాపు 2వేల కోట్లతో ఎస్సారెస్పీ పునరుజ్జీవన పనులను ఈ రోజు ప్రారంభించడం జరిగిందన్నారు. కాళేశ్వరం వద్ద నిర్మిస్తున్న ప్రాజెక్టు ద్వారా ఎస్సారెస్పీ వరదకాలువలోకి నీటిని మళ్లించి రివర్స్ పంపింగ్ ద్వారా ప్రతీరోజు ఒక టిఎంసి చొప్పున ఎస్సారెస్పీకి జలకల తేవడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమన్నారు. నిర్మల్ జిల్లాలోని సరస్వతి కాలువ కింద దాదాపు 35 వేల ఎకరాల భూములు సాగవ్వాల్సి ఉండగా, ఎన్నో ఏళ్లుగా కేవలం 10 నుండి 15 వేల ఎకరాలు మాత్రమే సాగవుతున్నాయన్నారు. ఈ పథకం పూర్తయితే సరస్వతి కాలువ కింద భూములన్నీ సస్యశ్యామలం కావడంతోపాటు నిర్మల్, ముధోల్ నియోజకవర్గాల్లో నిర్మాణంలో ఉన్న హైలెవల్ కాలువల ద్వారా ఆయా నియోజకవర్గాలోని మరో లక్ష ఎకరాల వరకు సాగుకు నోచుకోనున్నాయన్నారు. రైతుల కష్టాలను గుర్తించి ఎప్పటికప్పుడు అనేక ప్రణాళికలు రూపొందించి ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తే ప్రతిపక్షాలు దానిని జీర్ణించుకోలేకపోతున్నాయన్నారు. అభివృద్ధిని అడ్డుకుంటున్న ప్రతిపక్షాలకు ప్రజలే గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. అంతకుముందు జిల్లాకు చెందిన గృహనిర్మాణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ ఎస్సారెస్పీ నిండితేనే అన్నదాతల కడుపు పండుతుందన్నారు. ఎస్సారెస్పీ ఎగువన మహారాష్టల్రో అడ్డగోలుగా నిర్మించిన ప్రాజెక్టుల వల్ల ఎస్సారెస్పీకి చుక్కనీరు రావడంలేదన్నారు. దీనిని అధిగమించేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఎస్సారెస్పీ పునరుజ్జీవ పనులను ప్రారంభించి రైతులపాలిట అపరభగీరథుడిగా మారారని కొనియాడారు. ఈ పనులు పూర్తయితే నిర్మల్ జిల్లాలో ప్రతీ ఎకరాకు సాగునీరు అందుతుందన్నారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎంపి జి.నగేష్, జిల్లాపరిషత్ చైర్మన్ శోభారాణి సత్యనారాయణగౌడ్, ముధోల్, ఖానాపూర్ ఎమ్మెల్యేలు విఠల్‌రెడ్డి, రేఖానాయక్, మాజీ ఎంపి రాథోడ్ రమేష్, నిర్మల్ మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తిలతోపాటు జిల్లా నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు, రైతులు పాల్గొన్నారు.

సిఎం సభకు భారీగా తరలిన జనం
నిర్మల్: నిర్మల్ జిల్లా శివారులోని పోచంపాడ్‌లో గురువారం నిర్వహించిన ముఖ్యమంత్రి బహిరంగసభకు నిర్మల్ జిల్లా నుండి భారీగా జనం తరలివెళ్లారు. జిల్లాకు చెందిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి బహిరంగ సభను విజయవంతం చేసేందుకు వారంరోజుల నుండి జిల్లా వ్యాప్తంగా కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా రైతులను పెద్దసంఖ్యలో తరలించాలన్న ఉద్దేశంతో వాహనాలను అదేస్థాయిలో ఏర్పాటుచేశారు. ఒక్క నిర్మల్ నియోజకవర్గం నుండే 1200 ఆటోల్లో 18వేల మందిని, 150బస్సుల్లో 10వేల 500మందిని, 125ట్రాక్టర్లలో 4వేల మందిని, 300 జీపుల్లో 3 వేల మందిని, 50 డిసి ఎంలలో 1500 మందిని,600 బైక్‌లపై 1200 మందిని తరలించారు. అంతేకాకుండా మరో 150 కార్లలో టిఆర్‌ఎస్ శ్రేణులు ర్యాలీగా తరలివెళ్లారు. నియోజకవర్గం నుండే దాదాపు 60 వేలకు పైగా తరలివెళ్లారు. ముధోల్, ఖానాపూర్ నియోజకవర్గాలను కలిపితే లక్షకుపైగా జనం నిర్మల్ జిల్లా నుండి తరలివెళ్లినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే వేలాదిగా తరలివచ్చిన వాహనాలతో ట్రాఫిక్‌కు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. పోచంపాడ్‌లోని బహిరంగ సభ జరిగిన ప్రదేశం నుండి దాదాపు 15 కిలోమీటర్ల మేరకు ఎటుచూసినా అన్ని రోడ్లపై వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణీకులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. వందలాది మంది పోలీసులు ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు శ్రమించినా ఫలితం లేకపోయింది. సిఎం సభ ముగిసిన అనంతరం కూడా దాదాపు 5 గంటలపాటు వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
ప్రయాణికుల పరేషాన్
నిర్మల్: రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హాజరైన పోచంపాడ్ బహిరంగసభను ఎలాగైనా విజయవంతం చేయాలనే లక్ష్యంతో అధికార పార్టీ నేతలు ఆర్టీసి, ఇతర ప్రైవేటు వాహనాలను వినియోగించడంతో గురువారం సాదారణ ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రయాణ ప్రాంగణాల్లో గంటలతరబడి నిరీక్షించిన ఒక్కబస్సు కూడా రాకపోవడంతో ప్రయాణీకులు ఉన్న అరకొర ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఇదే అదునుగా వాహనదారులు అడ్డగోలు చార్జీలను వసూలుచేసి అందినకాడికి దండుకున్నారు. సాధారణ రోజుల్లో నిర్మల్ నుండి ఆదిలాబాద్‌కు వెళ్లేందుకు రూ.70లు బస్‌చార్జీ కాగా ప్రైవేటు వాహనదారులు ఒక్కొక్కరి నుండి రూ.200 నుండి 300 వరకు వసూలుచేశారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆర్టీసి అధికారులు ముందుచూపు లేకుండా వ్యవహరించి ప్రయాణీకులను ఏమాత్రం పట్టించుకోకపోవడం శోచనీయమని పలువురు వాపోయారు. పూర్తిగా అధికార పార్టీకి బస్సులను అప్పజెప్పి ప్రయాణీకులను ఇక్కట్లపాలుచేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

ఇద్దరు ఫారెస్ట్ బీట్ అధికారుల సస్పెన్షన్
ఖానాపూర్: ఖానాపూర్ రేంజర్ పరిధిలోని ఎక్భాల్‌పూర్, మందపెల్లిలో పనిచేస్తున్న బీట్ అధికారులు లక్ష్మినర్సయ్య, సూర్యనారాయణ రాజులను అటవీశాఖ ఉన్నతాధికారులు సస్పెండ్‌చేశారు. హైదరాబాద్ ప్రత్యేక తనిఖీ బృంధాలు ఇటీవల ఆ ఇద్దరు పనిచేసిన బీట్‌లను పరిశీలించగా టేకు చెట్లు నరికివేతకు గుర్తించారు. అటవీ విజిలెన్స్ అధికారులు ఇద్దరు బీట్ అధికారులపై చర్యలు తీసుకోవాలని నిర్మల్ డి ఎఫ్‌వో దామోదర్‌రెడ్డికి నివేదికను సమర్పించారు. వారి నివేదికలను అనుసరించి ఆ ఇద్దరు బీట్ అధికారులను నిర్మల్ డి ఎఫ్‌వో దామోదర్‌రెడ్డి సస్పెండ్‌చేసినట్లు గురువారం ఖానాపూర్ ఎఫ్‌బివో రాథోడ్ రవీంధర్ తెలిపారు.

మిషన్ భగీరథ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్
ఇచ్చోడ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మిషన్ భగీరథ పనులను గురువారం జిల్లా కలెక్టర్ బుద్ద ప్రకాష్ జ్యోతి పరిశీలించారు. మండల కేంద్రంలోని ఎల్లమ్మకుంట సమీపంలో జరుగుతున్న వాటర్‌గ్రిడ్ పనులను పర్యవేక్షించి, అధికారులతో మాట్లాడారు. మిషన్ భగీరథ పనులను వేగవంతం చేయాలని, పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇంటికి కుళాయిల ద్వారా స్వచ్చమైన నీరు అందించాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ పనుల్లో జాప్యం జరగకుండా నిర్ణిత గడవులోగా పనులు పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం బజార్‌హత్నూర్ మండలంలోని దిగ్నూర్, చింతకర్ర, ఉప్పర్‌పల్లి గ్రామాల సమీపంలో నిర్మిస్తున్న మిషన్ భగీరథ పంప్‌హౌస్ పనులను పరిశీలించారు. మండలంలో మరుగుదొడ్ల నిర్మాణం ఎంత వరకు పూరె్తైందని ఎంపిడీవో రామకృష్ణరావ్‌ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. 50శాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయిందని, 45 రోజుల్లో మిగితా వాటిని పూర్తిచేస్తామని వివరించారు. అనంతరం అందుగూడ గ్రామంలోని ఐటిడి ఏ ప్రాథమిక పాఠవాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో తాగునీటి సౌకర్యం కల్పించాలని సర్పంచ్ భీంబాయికి సూచించారు. కలెక్టర్ వెంట స్థానిక తహసీల్దార్ మోహన్‌సింగ్, వి ఆర్‌వో నాగోరావు, వాటర్‌గ్రిడ్ సిబ్బంది పాల్గొన్నారు.

హామీల అమలులో ప్రభుత్వం విఫలం
* సిపిఐ రాష్ట్ర నాయకులు గుండా మల్లేష్
ఆదిలాబాద్ టౌన్: టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్ అన్నారు. గురువారం సిపిఐ జిల్లా కౌన్సిల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ముఖ్యమంత్రి కెసిఆర్ తన మూడేళ్ళ పాలనలో మాటలతో గారడి చేయడమే తప్పా ఏ ఒక్క హామీని పూర్తిస్థాయిలో అమలుపర్చలేదన్నారు. దళితులకు ఇస్తామన్న మూడెకరాల భూమి ఇస్తామని చెప్ప మోసం చేయడమే కాకుండా డబుల్‌బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం ఇప్పటి వరకు చేపట్టకపోవడం టీఆర్‌ఎస్ అసమర్థపాలనకు నిదర్శణమన్నారు. సకాలంలో రైతులకు రుణాలు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కార్యకర్తలు, కాంట్రాక్టర్ల జేబులు నింపేందుకే మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలు చేపడుతున్నారని అన్నారు. మరోవైపు ఒక్క నోటిఫికేషన్ కూడా జారీ చేయకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతుందన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలపై సిపిఐ అధ్వర్యంలో ఉద్యమాలను ఉదృతం చేస్తామని, ఇందుకు పార్టీ కార్యకర్తలు సిద్దం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్.విలాస్, ముడుపు నళినిరెడ్డి, ముడుపు ప్రభాకర్, శ్రీనివాస్ యాదవ్, గోవర్ధన్, బోజారెడ్డి, గంగారెడ్డి, మెస్రం భాస్కర్, గంగాధర్, కుంటాల రాములు, సిర్ర దేవెందర్ తదితరులు పాల్గొన్నారు.

వరస బైక్ చోరీల నిందితుని అరెస్ట్
* 9 మోటారు బైక్‌ల స్వాధీనం
ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలో వరసగా మోటారు బైక్‌లు చోరీచేస్తూ అలజడి సృష్టిస్తున్న మహారాష్టక్రు చెందిన నిందితుడు సయ్యద్ ఫారుఖ్‌ను ఎట్టకేలకు గురువారం పోలీసులు అరెస్ట్ చేసి, తొమ్మిది మోటారు బైక్‌లను స్వాదీనపర్చుకున్నారు. ఈ సందర్భంగా గురువారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో జిల్లా ఎస్పీ ఎం.శ్రీనివాస్ మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లాలో దొంగతనాలు చేయడం సులువు కాదని మరోసారి రుజువైందన్నారు. గత సంవత్సర కాలం నుండి పట్టణంలో ద్విచక్ర వాహనాలు దొంగలించబడడంతో సిసిఎస్, పట్టణ పోలీసులు కలిసి ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందన్నారు. గురువారం పక్కా సమాచారంతో గాంధీ చౌక్‌లో పట్టణ సిఐ వి.సురేష్, సిసిఎస్ పోలీసులతో కలిసి వాహనాల తనిఖీలు నిర్వహించగా అనుమానస్పదంగా యువకుడు ద్విచక్రవాహనంపై వస్తుండగా పట్టుకొని విచారించడం జరిగిందని, మహారాష్ట్ర అర్ని గ్రామానికి చెందిన సయ్యద్ ఫారుఖ్ తన అన్న సయ్యద్ ఇస్మాయిల్‌తో కలిసి గాంధీనగర్‌లో ఉంటూ ద్విచక్ర వాహనాలకు దొంగలిస్తున్నట్లు తెలుపడం జరిగిందన్నారు. అతనంతరం దొంగలించిన వాహనాలు మూతపడిన సిసిఐ ఫ్యాక్టరీలో దాచి ఉంచగా పోలీసు బృందం అక్కడికి వెళ్ళి తొమ్మిది వాహనాలను స్వాధీనపర్చుకోవడం జరిగిందన్నారు. ఈ బీట్ సిస్టం ప్రారంభించడంతో పట్టణంలో అన్నికోణాల్లో పోలీసులు దృష్టి సారించగల్గుతున్నారని అన్నారు. వీడియో రికార్డింగ్ చేయడంతో అనుమానాస్పదంగా ఉన్న ప్రాంతాల్లోని వీడియో క్లిప్పులను క్షుణ్ణంగా పరిశీలించడంతో నేరాలను అదుపు చేయడమే కాకుండా నిందితులను పట్టుకోవడం జరుగుతుందన్నారు. నిందితుని సోదరుడు సయ్యద్ ఇస్మాయిల్ పరారీలో ఉన్నాడని, దొంగలించబడిన వాహనాలను బాదితులకు అప్పగించేలా చర్యలు తీసుకుంటామన్నారు. నేరాల అదుపుకు విశేషంగా కృషిచేస్తున్న పోలీసులకు రివార్డులు ప్రకటిస్తామన్నారు. కార్యక్రమంలో డిఎస్పీలు ఎ లక్ష్మీనారాయణ, కె.నర్సింహారెడ్డి, పట్టణ సిఐ వి.సురేష్, ఎస్సైలు ఎస్‌ఏ బాఖీ, జాదవ్ గుణవంత్‌రావు, హెడ్ కానిస్టేబుల్స్ సిరాజ్‌ఖాన్, ఏ.వెంకటస్వామి, కానిస్టేబుల్స్ జాకిర్ అలి, ఎ రమేష్, మంగల్‌సింగ్, రమణ, అసదుల్లాఖాన్, మహేందర్, తిరుపతి, విఠ్ఠల్, రాములు తదితరులు పాల్గొన్నారు.

డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్లు పేదలకు వరం
నిర్మల్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలుచేస్తున్న డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్ల పథకం పేదలకు వరం లాంటిదని రాష్ట్ర హౌసింగ్ కార్పోరేషన్ చైర్మన్ ఎం. భూమారెడ్డి అన్నారు. గురువారం నిర్మల్ మండలంలోని ఎల్లపెల్లి గ్రామంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నియోజకవర్గంలో నిర్మించిన తరహాలోనే ఇక్కడకూడా ఎంతో నాణ్యతగా, అందంగా డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టడం వల్ల కాంట్రాక్టర్ జగన్‌మోహన్‌రెడ్డిని ఆయన అభినందించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇందిరమ్మ ఇండ్ల పేరుతో కంటితుడుపు చర్యగా 5,10 వేల చొప్పున బిల్లులు మంజూరుచేయడం వల్ల అవి పునాదులకే పరిమితమయ్యాయని తెలిపారు. ఇప్పుడు అలా కాకుండా నిరుపేదలందరూ ఆత్మగౌరవంతో జీవనం సాగించాలన్న సంకల్పంతో ప్రభుత్వం సర్వాంగ సుందరంగా డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్లను నిర్మించి ఇస్తోందని తెలిపారు. ఆయన వెంట రాష్ట్ర ఆగ్రో చైర్మన్ లింగంపెల్లి కిషన్‌రావు, ప్రాజెక్టు డైరెక్టర్ చైతన్యకుమార్, జిల్లా సహకార అధికారి సూర్యచందర్‌రావు, పంచాయతీరాజ్ డిఈఈ తుకారాం రాథోడ్, హౌసింగ్ డిఈ నర్సయ్యలతోపాటు డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్లను నిర్మిస్తున్న స్పెషల్ క్లాస్-1 కాంట్రాక్టర్ లక్కడి జగన్‌మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.