మంచి మాట

ధర్మ గుణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీవితంలో సుఖదుఃఖాలు చీకటి వెలుగులంటారు. విచక్షణాజ్ఞానులు రెండింటినీ సమానంగా స్వీకరిస్తారు. సుఖదుఃఖాది ద్వంద్వములనుండీ దూరం కావాలని విజ్ఞులంతా అంటారు. సుఖదుఃఖాలను సమానంగా చూడాలని శ్రీకృష్ణుడు అర్జునునితో అన్నాడని గీత బోధిస్తుంది. సాధారణంగా మానవుల్లో చాలామంది దుఃఖాలలో దైవాన్ని స్మరిస్తారు సుఖం ఒనగూడేసరికి ఇదంతా నేను కష్టపడగా వచ్చని ప్రతిఫలం అని అనేస్తాడు. అనుకొంటాడు. దుఃఖం వస్తే మాత్రం తన్ను భగవంతుడు చిన్న చూపు చూస్తున్నాడని పూర్వజన్మలో పాపం చేశానేమో అని, భగవంతునికి ఎన్ని మొక్కులు మొక్కినా కరుణించడం లేదని అంటారు. కాని పెద్దలంతా సుఖాల్లో సైతం భగవంతుని నామాన్ని విడవక పఠిస్తుంటే దుఃఖాలు దరిచేరలేవని ప్రతి మానవుడు ఈ రెండింటినీ , పాళ్లు ఎక్కువగానో తక్కువగానో అనుభవిస్తాడు. సుఖమైనా దుఃఖమైనా అట్టే జీవితకాల పర్యంతమూ ఉండిపోదు. అవి బహు చంచలమైనవి.
స్వార్థం లేకపోవడం, స్వశక్తిపైన నిలబడడం లాంటివి మొదటినుంచి నేర్చుకుంటే చాలు దుఃఖం వచ్చినా అంతగా బాధపడక్కర్లేదు. కష్టజీవే కనుక కష్టాలను సులభంగా తట్టుకోగలుగుతారు. మనుస్మృతి నీ స్వశక్తిని నమ్ముకుంటే నీకు సుఖంగాను ఇతరులను నమ్ముకుంటే దుఃఖంగాను అనిపిస్తుంది అంటుంది. ఇది అక్షర సత్యం.
ఉన్నది చాలునని అనుకుంటే సుఖం, లేనిదానికోసం ఆశిస్తే దుఃఖమని మదర్ థెరిసా సందేశమిచ్చారు. మనమెలా సుఖంగా ఉండాలని కోరుకుంటామో అదేవిధంగా ఇతరులు కూడా సుఖంగా ఉండాలని కోరుకుంటే చాలు మనకు దుఃఖం చేరదు అనే సామాన్యుని అనుభవ సారం. దుఃఖితుల పట్ల సానుభూతిని కలిగి ఓదారిస్తే వారికి ధైర్యం మనోబలంకలుగ తుంది. దుఃఖాన్ని వారంతట వారు దూరం చేసుకొని బలవంతులు అవుతారు. సామాన్యులకైనా అసామాన్యులకైనా దుఃఖం కలుగుతుంది అనడానికి ఉదాహరణ శ్రీరాముని జీవితం. శ్రీరాముడు అల్లారుముద్దుగా పెరిగాడు. మారీచసుబాహులతో సంగ్రామం చేయడానికి రమ్మని పిలిస్తే చిరుత ప్రాయంలోను అడవిమార్గం పట్టారు ఆ అన్నదమ్ములు.
చివరకు అయోధ్య పట్నమంతా రాముడే రాజు కావాలని కోరుకుంటే దశరథుడు తన ముద్దులు మూటగట్టేవాడు, తన వంశప్రతిష్ఠ నిలిపేవాడు అయన రాముడికి పట్ట్భాషేకం చేయాలని ఉవ్విళ్లూరాడు. దానికి కావాల్సిన అన్నీ ఏర్పాట్లు చేశాడు. కాని చిట్ట చివరకు కైకమ్మ కోరికలతో రామునికి వనవాసం లభించింది.
కాని రాముడు మాత్రం పట్ట్భాషేకం చేస్తున్నామంటే తనకున్నదానిలో కొంత మిత్రులకు,పరివారానికి తనకు రాజ్యకిరీటం లభిస్తుందన్న ఆనందంలో పంచి ఇచ్చి తన తోటివారిని సంతోషింపచేశాడు. కొన్నాళ్లకు మళ్లీ తాను వనవాస దీక్ష వహిస్తున్నాడని తనకు ఉన్న పట్టుపీతాంబరాలు ఏవీ ఇపుడు పనికి రావని వాటిని ఇతరులుతీసుకొంటే అవి ఉపయోగ పడు తున్నట్టైనా ఉంటందని వాటిని కావాల్సిన వారికి అందచేయడంలో ఉత్సాహం చూపాడు. ఇలా ఎన్నో సుఖదుఃఖాలకు రాముడు ఒకేలా స్పందించాడు. చివరకు వనవాసం పూర్తి అయ రాముడు రాజు అయన తర్వాత కూడా సీతారాములు సంతోషంగా కాలం గడప వచ్చుని అనుకొనేంతలో ఎవరో ఏదో అపవాదు వేశారని రాముడు రమణీలోలుడు కాడని చెప్పడానికి నిరూపించుకోవడానికి తన ప్రాణమైన సీతమ్మను అడవిలో విడిచి రమ్మని చెప్పాడు. పాండవులూ అంతే తమను దుర్యోధనుడు ఎన్ని బాధలు పెట్టినా వారెపుడూ కించిత్తు కూడా దుఃఖించ లేదు. ధర్మాన్ని తప్పలేదు. ఎదుటి వాడు దుర్యోధనుడిని శిక్షిస్తుంటే కూడా చూస్తూ వూరుకోలేదు. మనలో మనకు నూరు కొట్లాటలు ఉన్నా ఎధుటివారికి మనమంతా ఒకటే. కనుక ఎవరూ కురువంశాన్ని వేలెత్తి చూపకూడదనే అనుకొన్నారు.
కష్టాలన్నీ వచ్చినా కృష్ణుని అండ మాకు ఉంటే చాలనుకున్నారు. భోగభాగ్యాలు లేకపోయనా కృష్ణయ్య తోడు ఉంటే అదే పదివేలన న్నారు. ధర్మం తప్పని వారికి తాత్కాలికంగా కష్టాలు కలిగినా అవి మంచులా కరిగిపోతాయ. కొన్నాళ్లు చీకటి వారి జీవితంలో దూసుకొచ్చినా వెలుగు తప్పనిసరిగా వస్తుంది. కేవలం వారు మానవత్వంతో ధర్మాచరణ చేస్తూ ఉంటే చాలు వారిపై భగవంతుని అనుగ్రహం ఉండి తీరుతుంది.

- చివుకుల రామమోహన్