నీడ పోయింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆనంద్ రవి, కోమలి జంటగా ఆచార్య క్రియేషన్స్, ఆనంద్ రవి కానె్సప్ట్స్ బ్యానర్‌పై ఆనంద్ రవి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం నెపోలియన్. నిర్మాత భోగేంద్ర గుప్త. ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ కార్యక్రమం బుధవారం హైదరాబాద్‌లో జరిగింది. ట్రైలర్‌ను హీరో సందీప్ కిషన్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాత దామోదర్ ప్రసాద్, రచయిత లక్ష్మీభూపాల్, ఉత్తేజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దామోదర్‌ప్రసాద్ మాట్లాడుతూ- ఆనంద్ రవి చాలా కాలంగా తెలుసు. తనలో మంచి టాలెంట్ వుంది. అతను తీసిన ప్రతినిధి మంచి కథతో తెరకెక్కింది. ఈ సినిమ కథ వినగానే కొత్తగా అనిపించింది. ట్రైలర్, పోస్టర్ ఆకట్టుకున్నాయి. తప్పకుండా మంచి విజయం సాధిస్తుంది అన్నారు. హీరోయిన్ కోమలి మాట్లాడుతూ- ఇది సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. తప్పకుండా ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది అన్నారు. సందీప్ కిషన్ మాట్లాడుతూ- ఆనంద్ రవిలో మంచి టాలెంట్ వుంది. అది ప్రతినిధి సినిమాతోనే తెలిసిపోతుంది. నిజానికి ఆ సినిమా నేను చేయాలి. ఈ సినిమాలో నీడ పోయిందనే పాయింట్ కొత్తగా ఉంది. రవన్నతో నేను చేయాలనుకున్న సినిమా త్వరలోనే మొదలవుతుంది. నిర్మాతకు ధన్యవాదాలు అన్నారు. దర్శకుడు ఆనంద్ రవి మాట్లాడుతూ- ఈ కథను చాలామందికి చెప్పాను. నీడ పోయింది అనగానే ఇది షార్ట్ ఫిలిమా అని అడిగారు. అలాగే నువ్వే హీరోనా అని అన్నారు. థ్రిల్లర్ జోనర్ సినిమా అయినా సరికొత్త కానె్సప్టుతో సాగుతుంది. ఇంతవరకు ప్రేక్షకులు నా సినిమాలనుంచి ఏం కోరుకుంటున్నారో అది ఇందులో ఉంటుంది అన్నారు. ఈ చిత్రంలో రవివర్మ, కేదార్ శంకర్, మధుమణి, అల్లు రమేష్ తదితరులు నటించారు.