అదిలాబాద్

బిజెపి బంద్ విజయవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దివ్యనగర్: నిర్మల్ జిల్లా కేంద్రంలోని జిల్లాస్థాయి కార్యాలయాలు భీమన్నగుట్టకు తరలించడాన్ని నిరసిస్తూ భారతీయ జనతాపార్టీ ఇచ్చిన పిలుపుమేరకు నిర్మల్ జిల్లా బంద్ శుక్రవారం విజయవంతమైంది. పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలతోపాటు వ్యాపార సంస్థలను మూసివేయించడంతో జనజీవనం స్థంభించిపోయింది. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఉదయం తెల్లవారుజామునే బిజెపి రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గస్థాయి నాయకులను అరెస్ట్‌చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆర్టీసీ బస్సులు నడవకుండా అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పటికి ఫలితం లేకపోయింది. బస్సులు యధావిధిగా తిరిగినప్పటికి వ్యాపారసంస్థలు మూసివేయడంతో నిర్మల్ జిల్లా కేంద్రానికి ఇతర ప్రాంతాల నుండి రాలేకపోయారు. ఉదయం నుండి సాయంత్రం వరకు నిర్మల్ జిల్లా కేంద్రంలోని అన్ని వ్యాపార సంస్థలు మూసి ఉంచడంతో ఆయా కాలనీలు బోసిపోయినట్లు కనిపించాయి. ఆర్టీసి బస్టాండ్ ప్రయాణీకులు లేక వెలవెలబోయింది.
పోలీసుల అదుపులో బిజెపి నాయకులు
పోలీసులు ముందస్తుగా బిజెపి నాయకులను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కేంద్ర ఆయిల్ సంస్థ డైరెక్టర్ అయ్యన్నగారి భూమయ్య, గోదావరి కృష్ణా జలాల కన్వీనర్ రావుల రాంనాథ్, మెడిసెమ్మ రాజు, రచ్చ మల్లేష్, అంజుకుమార్‌రెడ్డి, శ్రావణ్‌రెడ్డి, నాయుడి మురళీధర్, ఆడెపు సుధాకర్‌లను ముందస్తుగా అరెస్ట్ చేశారు. బంద్ విజయవంతం పట్ల నిర్మల్ జిల్లా బిజెపి అధ్యక్షురాలు పి.రమాదేవి కృతజ్ఞతలు తెలిపారు.
15వ రోజుకు చేరిన బిజెపి దీక్షలు
నిర్మల్ ప్రభుత్వ కార్యాలయాలను భీమన్నగుట్టకు తరలించడాన్ని నిరసిస్తూ బిజెపి ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహారదీక్షలు శుక్రవారానికి 15వ రోజుకు చేరుకున్నాయి. శుక్రవారం మాజీ మున్సిపల్ ఛైర్‌పర్సన్ అయ్యన్నగారి భూలక్ష్మి ఆధ్వర్యంలో మహిళలు దీక్షలో కూర్చున్నారు.

కాంగ్రెస్‌పార్టీ బలోపేతానికి కృషిచేయాలి
* ఖానాపూర్ అసెంబ్లీ ఇంచార్జి హరినాయక్
* కడెంలో పలువురు మైనార్టీలు కాంగ్రెస్‌లో చేరిక
కడెం: జాతీయపార్టీ అయిన కాంగ్రెస్‌పార్టీ బలోపేతానికి కృషిచేయాలని కాంగ్రెస్‌పార్టీ ఖానాపూర్ అసెంబ్లీ ఇంచార్జి ఆజ్మీర హరినాయక్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రమైన కడెంలోని స్థానిక ముస్లిం పెద్దలు, యువకులు, మండలంలోని పలు గ్రామాల యువకులు కాంగ్రెస్‌పార్టీ ఖానాపూర్ అసెంబ్లీ ఇంచార్జి హరినాయక్ ఆధ్వర్యంలో దాదాపు 150 మంది కాంగ్రెస్‌పార్టీలో చేరారు. వీరికి హరినాయక్, యువజన కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు సతీష్‌రెడ్డి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా హరినాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్‌పార్టీ అన్నివర్గాల ప్రజలకు ప్రాధాన్యం ఇచ్చి గతంలో తమ పాలనలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలుచేసిందన్నారు. పార్టీ హయాంలో ముస్లింలకు, బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి పాటుపడిందన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్‌పార్టీ అని ఆయన గుర్తుచేశారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ గెలుపుకు కృషిచేయాలని, పార్టీలో చేరినవారందరికి ఆయన పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్‌పార్టీ నాయకులు కంటెం శంకర్, వెంకటేష్, రియాజొద్దిన్, రమేష్, షేక్ రఫిక్, మైనార్టీసెల్ కడెం మండల అధ్యక్షులు ఎండి వాజిద్‌ఖాన్, యూత్ కాంగ్రెస్ కడెం అధ్యక్షులు మల్లేష్‌యాదవ్, ఎం ఎ బాబా, ఆజి, హైమద్, బబ్లూ, సలేమియా, గౌస్, ఇమ్రాన్, తాజొద్దిన్, చారి, లక్ష్మణ్, ప్రవీన్, కౌసర్, ముస్త్ఫా, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఆదర్శప్రాయుడు సర్ధార్ పాపన్నగౌడ్
* ముధోల్ ఎమ్మెల్యే జి. విఠల్ రెడ్డి
ముధోల్: బహుజనుల హక్కుల కోసం పోరాడిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అందరికి అదర్శప్రాయుడని ముధోల్ ఎమ్మెల్యే జి. విఠల్ రెడ్డి అన్నారు. శుక్రవారం నియోజకవర్గ కేంద్రంలో శ్రీశ్రీ రేణుకామాత గౌడ సంఘం అధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న విగ్రహ ప్రతిష్టపానకు భూమి పూజ చేశారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ పాపన్న గౌడ్ జివిత చరిత్రను సమాజంలోని ప్రతి ఒక్కరూ విధిగా చదవాలని కోరారు. ముఖ్యంగా పాపన్న గౌడ్ చూపిన బాటలో పయనిద్దామని పిలుపునిచ్చారు. ప్రభుత్వం సహితం గౌడ కులస్థుల సంక్షేమానికి విశేషంగా కృషి చేస్తుందని తెలిపారు. పాపన్న గౌడ్ విగ్రహ ఏర్పాటుకు తనవంతుగా సహకరిస్తానని అన్నారు. మూడు శతాబ్దాల క్రితం ప్రజలకు స్వయం పాలన హక్కులను కల్పించడానికి పాపన్న గౌడ్ చేసిన కృషిని మరువలేమని పేర్కొన్నారు. అదేవిధంగా ప్రభుత్వం అన్నివర్గాల సంక్షేమానికి కృషి చేస్తుందని తెలిపారు. ప్రజలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను దేశంలోని ఇతర రాష్టల్రు అదర్శంగా తీసుకుంటున్నాయని అన్నారు. శ్రీశ్రీ రేణుకామాత గౌడ సంఘం అధ్వర్యంలో సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ముధోల్ జడ్పీటిసి సభ్యురాలు బి. లక్ష్మీనర్సాగౌడ్, భైంసా ఎ ఎమ్ సి వైస్ చైర్మన్ అఫ్రోజ్‌ఖాన్, పి ఎసి ఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, ముధోల్ వైస్ ఎంపిపి ఎజాజోద్దిన్, తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర నాయకులు అమరవేణి నర్సాగౌడ్, నాయకులు రామకృష్ణ గౌడ్, ముధోల్ సర్పంచ్ అనిల్, మాజి ఎంపిటిసి సభ్యుడు బి. పోతన్న యాదవ్, పి ఎసి ఎస్ డైరెక్టర్ వెంకటేశ్ గౌడ్, శ్రీ శ్రీ రేణుకామాత గౌడ సంఘం అధ్యక్షులు ఆకుల దేవేందర్ గౌడ్, మండల గౌడ సంఘం అధ్యక్షులు ఆకుల మురళి గౌడ్, కార్యదర్శి నేరేళ్ల రామాగౌడ్, సభ్యులు, వివిధ గ్రామాల్లోని గౌడ సంఘం సభ్యులు, స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

నిర్మల్ సర్వతోముఖాభివృద్ధికి కృషి
* రోడ్డు విస్తరణ పనులకు మంత్రి అల్లోల శంకుస్థాపన
నిర్మల్: నిర్మల్ జిల్లా సర్వతో ముఖాభివృద్ధికి సాయశక్తుల కృషి చేస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ, న్యాయ, గృహనిర్మాణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని శివాజీచౌక్ నుండి చించోలి(బి) ఎక్స్‌రోడ్డు వరకు రూ.30 కోట్లతో చేపట్టనున్న జాతీయ రహదారి రోడ్డు విస్తరణ పనులకు మంత్రి అల్లోల శివాజీచౌక్ వద్ద శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో రహదారుల నిర్మాణానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. రహదారి రద్దీగా ఉండడంతో రోడ్డుకు రెండువైపులా రెండు వరుసలతో నిర్మించడంతోపాటు సెంట్రల్ లైటింగ్, గ్రీన్ బెల్ట్, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీలు నిర్మించడం జరుగుతుందన్నారు. ఇప్పటికే మంచిర్యాల ఎక్స్‌రోడ్డు నుండి జాతీయ రహదారి బైపాస్ వరకు రోడ్డు విస్తరణ పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. అలాగే శివాజీచౌక్ నుండి కడ్తాల్ వరకు ఆర్‌అండ్‌బి ఆధ్వర్యంలో రోడ్డు విస్తరణ పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. రహదారిని సర్వాంగ సుందరంగా ముస్తాబుచేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం అహర్నిషలు కృషి చేస్తుందన్నారు. మంత్రి వెంట మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి, గ్రంథాలయ చైర్మెన్ ఎర్రవోతు రాజేంధర్, మార్కెట్ కమిటీ చైర్మన్ దేవేందర్‌రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, టిఆర్‌ఎస్ నాయకులు అయ్యన్నగారి రాజేంధర్, కౌన్సిలర్ గణేష్, సత్యనారాయణ, పాకాల రాంచందర్, మేడారం ప్రదీప్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ప్రోటోకాల్ వివాదంపై జడ్పీటీసీల గరంగరం
* నిధులు.. అధికారాలపై సభ్యుల నిరసన గళం
* మీటింగ్‌లకు హాజరుకాని అధికారులపై చర్యలు
* చప్పగా సాగిన జడ్పీ సర్వసభ్య సమావేశం
ఆంధ్రభూమి బ్యూరో
ఆదిలాబాద్: ప్రభుత్వం ఏర్పడి మూడేళ్ళు గడిచినా ప్రజలచేత ఎన్నుకోబడ్డ జడ్పీటీసీలు, ఎంపిపిలకు కనీస గౌరవ మర్యాదలు ఇవ్వడంలేదని, నిధులు, విధులు లేకుండా తాము ప్రజల ముందు మోహం చాటేయాల్సిన పరిస్థితి నెలకొందని జడ్పీటీసీలు ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితుల్లో మార్పు రాకపోతే ఇక తాము సామూహికంగా రాజీనామాలు సమర్పిస్తామని జడ్పీటీసీలు ఆల్టిమేటం జారీ చేశారు. శుక్రవారం జడ్పీ చైర్‌పర్సన్ వల్లకొండ శోభారాణి అధ్యక్షతన జరిగిన జడ్పీ సమావేశానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపి గెడం నగేష్, శాసనసభ్యులు రాథోడ్ బాపురావు, రేఖానాయక్, విఠల్ రెడ్డి, కోవ లక్ష్మి, ఎమ్మెల్సీ పురాణం సతీష్‌తో పాటు మూడు జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ శాఖల పనితీరుపై మొక్కుబడిగా చర్చ జరగ్గా అధికారులు సరైన సమాధానాలు ఇవ్వకపోవడంతో ఎంపి నగేష్‌తో పాటు జడ్పీటీసీలు సైతం అసహనం వ్యక్తం చేశారు. కీలకమైన జడ్పీ సమావేశాలకు అధికారులు తరుచూ గైర్హాజరు కావడం ద్వారా జవాబుదారితనం లోపిస్తోందని, అధికారులు తమ బాధ్యతలను విస్మరిస్తున్నారని ఎంపి నగేష్ అగ్రహం వ్యక్తం చేశారు. అటవీ శాఖపై జరిగిన చర్చలో ఎంపి మాట్లాడుతూ బోథ్ నియోజకవర్గంలో అటవీ శాఖ మంత్రి రామన్న అధ్వర్యంలో అట్టహాసంగా భారీ ఎత్తున మొక్కలునాటగా ఆతర్వాత అధికారులు గుంతలు పూర్చడం మర్చిపోయారని, దీంతో మొక్కలు చనిపోయినా పట్టించుకోవడంలేదని విమర్శించారు. ప్రభుత్వ పథకాలకు మళ్ళించే ఇసుకపై ఆంక్షలు విధిస్తూ అధికారులు మామూళ్ళు తీసుకుంటున్నారని, కిందిస్థాయి నుండి పైస్థాయ వరకు ఇసుక మాఫియాల్లో అధికారులు ఎలా వ్యవహరిస్తున్నారో తమందరికి తెలిసేనని చురకలు అంటించారు. ప్రైవేట్ దళారులు, ట్రాక్టర్ల యజమానులతో కుమ్మక్కై అధికారులు ఇసుక అక్రమ రవాణాకు తెరతీస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే రేఖానాయక్ మాట్లాడుతూ ఉట్నూరు ఏజెన్సీ అటవీ ప్రాంతంలో ఇసుకు అక్రమ రవాణా జోరుగా సాగుతోందని, దేవాలయం నిర్మాణానికి ఇసుకు తీసుకవెళ్తే అధికారులు మామూళ్ళు తీసుకొని విడిచిపెట్టారని ఆరోపించారు. ఓ బడా నాయకుడు చెప్పిన మాటలు విని అటవీ అధికారులు ఇష్టారాజ్యాంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి జోక్యం చేసుకుంటూ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఇసుక రవాణా జరిగితే అడ్డుకోవద్దని, దేవాలయాలకు ధ్వజ స్తంభాలకు ఫీజులు చెల్లించినా అధికారుల వేదింపులు తప్పడం లేదన్నారు. డబుల్‌బెడ్‌రూంల నిర్మాణాలకు ఇసుక అనుమతి ఇచ్చామని మంత్రి స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే మంచిర్యాల డిఎఫ్‌వో ప్రభాకర్ మాట్లాడుతూ తమ జిల్లాలో 98 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా నిన్నటి వరకు 64 లక్షల 53వేల మొక్కలు నాటడం జరిగిందన్నారు. ఆసిఫాబాద్ జడ్పీటీసీ ఏమాజీ మాట్లాడుతూ మొక్కలు నాటే శ్రద్ద సంరక్షణలో కనిపించడం లేదని, కనీసం ట్రీగార్డులు కూడా పెట్టకపోవడంతో పశువులకు మేతగా మారిపోతున్నాయని, ప్రజా ధనంతో దుర్వినియోగం అవుతుందని ఆరోపించారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ 33శాతం అటవీ పచ్చదనం పెంచేందుకే రాష్ట్ర వ్యాప్తంగా 230 కోట్ల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు రూపొందించామని, సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరు వాటి సంరక్షణపై దృష్టిసారించాలన్నారు. చిన్న లోపాలను భూతద్దంలో చూపవద్దని సూచించారు. ఈదశలో దిలావర్‌పూర్ జడ్పీటీసీ సునీత మాట్లాడుతూ మంత్రిగారు వస్తేనే హరితహారం మొక్కలు నాటుతారని, ఆతర్వాత అధికారులు ఎక్కడా కనిపించరని తెలిపారు. నామినేటెడ్ పోస్టులతో వచ్చిన నేతలకు ఇచ్చిన గౌరవం ప్రజలతో ఎన్నుకోబడిన జడ్పీటీసీలకు ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బెల్లంపల్లి జడ్పీటీసీ రాంచందర్ మాట్లాడుతూ హరితహారంలో భారీ ఎత్తున మొక్కలు పంపిణీ చేసి వృదాగా పడివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పలువురు జడ్పీటీసీలు మాట్లాడుతూ తమకు ప్రోటోకాల్ పాటించడంలేదని, అధికారులు గౌరవం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిధులు, విధులు లేకపోగా కనీసం మర్యాదకూడా ఇవ్వడం లేదని అగ్రహం వ్యక్తం చేయగా మంత్రి ఐకెరెడ్డి జోక్యం చేసుకొని ప్రోటోకాల్ నిబంధనలు పాటించని అన్ని శాఖల అధికారులపై చర్యలు తీసుకోవాలని, తప్పనిసరిగా జడ్పీటీసీలను సమావేశాలకు ఆహ్వానించాలని కలెక్టర్లను ఆదేశించారు. వేమనపల్లి ఎంపిపి మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలో నకిలీ పత్తి విత్తనాలతో రైతులు దగా పడుతున్నారని, వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టడంలేదని విమర్శించారు. ఇదిలాఉంటే, జడ్పీటీసీ ఏమాజీ మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్‌బీమా యోజన పథకంపై ప్రచారం చేయడం లేదని, దీంతో రైతులు బీమా పొందలేకపోతున్నారని విమర్శించారు. మందమర్రి మండలం క్యాతనపల్లిలో పశువుల ఆసుపత్రిలో నిర్మించి పదిహేను సంవత్సరాలు గడిచిన ఇప్పటి వరకు ప్రారంబించలేదన్నారు. గత మూడేళ్ళుగా బిసి కార్పోరేషన్ రుణాలు ఇవ్వకపోవడంపై సభ్యులు అధికారులను నిలదీశారు. ప్రభుత్వం లక్షాలను నిర్దేశించి, బ్యాంకర్లకు ఆదేశాలు జారీచేసినా నిరుద్యోగులకు మాత్రం రుణాలు అందడం లేదన్నారు. దళారులు దోపిడి చేస్తున్నారని సభ్యులు ఆరోపించారు. ఆదిలాబాద్ మైనార్టీ కార్పోరేషన్ అస్తవ్యస్థంగా మారిందని జడ్పీటీసీ ఆశోక్ విమర్శించారు. సమావేశానికి ఆదిలాబాద్ జాయింట్ కలెక్టర్ కె.కృష్ణారెడ్డి, జడ్పీ సిఈవో జితేందర్ రెడ్డి, నిర్మల్ కలెక్టర్ ఇల్లంబర్తి, మంచిర్యాల కలెక్టర్ ఆర్‌వి కర్ణన్, ఆసిఫాబాద్ కలెక్టర్ చంపాలాల్ తదితరులు పాల్గొన్నారు.