విశాఖ

సిఎస్‌ఆర్ ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: కింగ్ జార్జి ఆసుపత్రిలో రూ.80 కోట్ల కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బిలిటీ (సిఎస్‌ఆర్) కింద చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ ఆదేశించారు. కెజిహెచ్‌ను శుక్రవారం సందర్శించిన ఆయన సిఎస్‌ఆర్ కింద చేపట్టిన పనులను సమీక్షించడంతో పాటు స్వయంగా పరిశీలించారు. తొలి దశలో పనులు పూర్తవుతున్న నేపథ్యంలో రెండో దశకు నిధుల సమీకరణకు గాను కంపెనీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయాల్సిందిగా సూపరింటెండెంట్ డాక్టర్ అర్జునను ఆదేశించారు. పనులు సకాలంలో పూర్తయ్యేందుకు గాను ఎపిఎంఎస్‌ఐడిసి ఇంజనీర్లు గుత్తేదారులతో సమీక్షించాలని సూచించారు. మెడ్‌ఆల్ డయాగ్నోస్టిక్ కేంద్రంలో రేడియాలజీ సేవలను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం వైద్యులు, సిబ్బందితో మాట్లాడారు. కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ వి ధర్మారావు, సిఎస్‌ఆర్ ఇన్‌ఛార్జ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కెఎస్‌ఎల్‌జి శాస్ర్తీ, ఎఆర్‌ఎంఓ బి బంగారయ్య, తదితరులు పాల్గొన్నారు.