నో.. ప్రాబ్లమ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిసింద్రి అఖిల్ అక్కినేని తాజాగా నటిస్తున్న ఓ చిత్రానికి సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో అన్నపూర్ణ సినీ స్టూడియోస్ పతాకంపై అక్కినేని నాగార్జున ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన స్టిల్ బయటికి రావడంతో నాగార్జున స్పందించారు. ఇది ఇప్పుడు బయటికి వస్తే ఏమైంది? ఇంతకన్నా పెద్దది, మెరుగైనది ఈనెల 21న విడుదల చేయనున్నామని తన ట్విట్టర్ ఖాతాదా ట్వీట్ చేశారు. ఇందుకు సంబంధించిన అన్ని వివరాలు రేపు తెలియజేస్తానంటూ ఆయన చెప్పడం మరో విశేషం. అఖిల్ ఓవైపు విలన్‌తో ఫైట్ చేస్తూ, మరోవైపు హీరోయిన్‌తో రొమాన్స్ చేస్తున్న ఈ స్టిల్ ప్రస్తుతం హాట్ హాట్‌గా ఫిలింనగర్‌లో చక్కర్లుకొడుతోంది. ఈ ఫొటో ఎప్పుడు బయటికి వచ్చిందో తెలియదు కానీ, 21న మాత్రం ఇంతకన్నా మంచి ఫొటోను ఫస్ట్‌లుక్‌గా విడుదల చేస్తున్నామని నటుడు అఖిల్ స్పందించారు. ఎక్కడ ఎక్కడ ఉందో తారక అన్న పేరును ఈ సినిమాకు పరిశీలిస్తున్నట్లు యూనిట్ వర్గాలు తెలిపారు. నూతన కథానాయిక కల్యాణి ప్రియదర్శిని నటిస్తున్న ఈ చిత్రాన్ని ఈ సంవత్సరాంతానికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.