శ్రీకాకుళం

సమాజాభివృద్ధికి యువత కృషి చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎచ్చెర్ల: సమాజాభివృద్ధి వేగవంతానికి యువత అంకిత భావంతో కృషి చేయాలని శ్రీకాకుళం ఆర్డివో బలివాడ దయానిధి స్పష్టంచేశారు. చిలకపాలెం కూడలిలోని శ్రీ శివానీ ఇంజినీరింగ్ కళాశాలలో గత 15 రోజులుగా నెహ్రూ యువకేంద్రం వాలంటీర్ల శిక్షణా తరగతులు ఆదివారంతో ముగిశాయి. ఈ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఆర్డివో మాట్లాడుతూ గ్రామాల్లో పేరుకుపోయిన సమస్యలను ప్రజా ప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు వాలంటీర్లు సేవలు ఎంతైనా అవసరమన్నారు. యువజన సంఘాలు ఏర్పాటు, క్రీడల పోటీలు అక్షరాస్యతా పెంపు, స్వచ్ఛ్భారత్ వంటి కార్యక్రమాలు అమలు పట్ల అవగాహన పెంచుకుని ముందుకు సాగాలన్నారు. విద్యాధికులు మంచి సమాజం కోసం పాటు పడేలా వివిధ కార్యక్రమాలను రూపొందించాలన్నారు. స్థానిక వనరులను సద్వినియోగం చేసుకొని స్వయం ఉపాధి యువత సాధించే విధంగా అవగాహన పెంపొందించాలన్నారు. ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అర్హులకు అందించేందుకు వాలంటీర్లు అంతా చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. నెహ్రూ యువకేంద్రం కో ఆర్డినేటర్ కె.వి రమణ మాట్లాడుతూ 15 రోజులపాటు నిర్వహించిన ఈశిక్షణా తరగతులకు 115 మంది వాలంటీర్లు హాజరు కావడం అభినందనీయమన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూ.గోతోపాటు యానాం ప్రాంతం నుండి వాలంటీర్లు శిక్షణ తరగతులకు హాజరై అనేక నైపుణ్యాలపై అవగాహన పెంచుకోవాలని పేర్కొన్నారు. క్షేత్ర ప్రచారాధికారి డాక్టర్ కొండలరావు మాట్లాడుతూ వాలంటీర్లు కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలుపై అవగాహన పెంచుకుని వాటి ద్వారా ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాలు చేరవయ్యే కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. ఐతమ్ కళాశాల డీన్ ప్రొ.విష్ణుమూర్తి మాట్లాడుతూ శిక్షణా తరగతుల్లో నేర్చుకున్న వివిధ అంశాలను క్షేత్రస్థాయిలో అన్వయించి మంచి సమాజం ఆవిర్భావానికి మీ వంతు సేవలందించాలన్నారు. ఈసందర్భంగా వాలంటీర్లకు సర్ట్ఫికేట్‌లను అందజేశారు. రెండేళ్లపాటు వాలంటీర్లగా ఎంపికైన వారికి ప్రతీ నెల గౌరవవేతనం రూ.5వేలు కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుందని సంబంధిత అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ వై కె ప్రతినిధులు శిమ్మ సత్యన్నారాయణ, కళాశాల ప్రిన్సిపల్ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.