విజయవాడ

హాస్టల్స్, అంగన్‌వాడీ కేంద్రాలకు నాణ్యమైన సన్నబియ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ,: వసతి గృహాలు, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు నాణ్యమైన సన్నబియ్యాన్ని అందించనున్నామని, వసతి గృహాలను ఆహ్లాదంగా, పరిశుభ్రంగా ఉంచాలని కలెక్టర్ బి.లక్ష్మీకాంతం సంక్షేమ అధికారులను ఆదేశించారు.
నగరంలోని గుణదల గంగిరెద్దుల దిబ్బ, బిసి బాలుర వసతి గృహంతోపాటు మరికొన్ని హాస్టళ్లను లక్ష్మీకాంతం ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులతో వసతి గృహంలో అందిస్తున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. పరిశుభ్రమైన తాగునీరు ఇస్తున్నారా, డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారా, దోమలు రాకుండా మెష్ ఏర్పాటు చేశారా వంటి పలు ప్రశ్నలతో విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వసతి గృహం పరిశుభ్రంగా లేకపోవడం పట్ల సంక్షేమ అధికారి శ్రీనివారావును వివరణ కోరుతూ 4రోజుల్లో వసతి గృహం బయట, లోపల గదుల్లో పెయింట్ వేయించి అందంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ అన్నారు. 4రోజుల్లో తాను తిరిగి వసతి గృహం పరిశీలిస్తానని, అప్పటికి పనులు పూర్తిచేసి సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. విద్యార్థులకు బయోమెట్రిక్ తప్పనిసరిగా నమోదు చేయించాలన్నారు. గదుల్లో అదనంగా 2 ట్యూబ్‌లైట్లు వేయించాలని కలెక్టర్ ఆదేశించారు.
వంటశాలలో ఆహార పదార్థాలను పరిశీలించిన కలెక్టర్
విద్యార్థులకు అందిస్తున్న ఆహార పదార్ధాలను కలెక్టర్ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. వసతి గృహాల్లో 150 మంది విద్యార్థులు ఉంటున్నారని వారికి ప్రతిరోజూ మెనూ ప్రకారం ఆహారం అందిస్తున్నామని సంక్షేమ అధికారి శ్రీనివాసరావు కలెక్టర్‌కు వివరించారు. విద్యార్థులు, చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు మధ్యాహ్న భోజన పథకం, అన్న అమృత హస్తం పథకం ద్వారా అందిస్తున్న ఆహారంలో నాణ్యమైన సన్నబియ్యం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. సోమవారం మచిలీపట్నంలో రైస్‌మిల్లర్లతో సన్నబియ్యం సేకరణపై ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నామని కలెక్టర్ తెలిపారు.