వరంగల్

అక్రమ కట్టడాలకు అనుమతులు నో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నక్కలగుట్ట: మహానగర పాలక సంస్థలోని భవనాలు, బహుళ అంతస్తులను నిర్మించుకునే యజమానులు మున్సిపల్ నిబంధనలకు అనుగుణంగా ఉండేటే అనుమతులకు అంగీకరిస్తామని మున్సిపల్ కమిషనర్ శృతి ఓఝా అన్నారు. సోమవారం బల్దియా పరిధిలోని ఏనుమాముల మార్కెట్ దగ్గరలో నిర్మింపబడుతున్న బహుళ అంతస్తుల భవనం, శాయంపేటలోని గేటెడ్ కమ్యూనిటీ హాల్, నరుూంనగర్ కెయుసి గేట్‌రోడ్, బాలసముద్రం, హంటర్‌రోడ్డు ప్రాంతాలలో కొత్తగా నిర్మించతలపెట్టిన పది బహుళ అంతస్తుల భవనాలను పరిశీలించి, భవనాలకు అన్ని అనుమతులు ఇవ్వడానికి నిబంధనల మేరకు కట్టడాలు ఉన్నాయా లేదా అని పరిశీలించారు. అదే విధంగా వినాయక నిమజ్జనాన్ని పురస్కరించుకుని నగరంలోని బందం చెరువు, పద్మాక్షి గుట్ట, చిన్న వడ్డేపల్లి చెరువులను పోలీసు కమిషనర్ సుధీర్‌బాబు కలిసి కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, క్షేత్ర స్థాయిలో అధికారులు పర్యటనలు జరిపి ఏఏ చెరువుల యందు ఏ ఏ ప్రాంతాలకు సంబందించిన వినాయకులను నిమజ్జనం చేయడానికి అనుకూలమో తెలపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిటీ ప్లానర్ చంద్రిక, ఎసిపిలు శైలజ, గణపతి, ఎస్‌ఇ బిక్షపతి, డిఇ లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.