అశ్లీలత కనిపించదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయ్ దేవరకొండ, షాలిని జంటగా సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రణయ్‌రెడ్డి నిర్మించిన ‘అర్జున్‌రెడ్డి’ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు, ట్రైలర్లు సంచలనం రేపుతున్నాయి. ఈ సందర్భంగా దర్శకుడు సందీప్‌రెడ్డి చెప్పిన విశేషాలు..
అర్జున్‌రెడ్డి ఎవరు?
ఇది ఎమోషనల్‌గా సాగే జర్నీ. పాత్రలు కూడా పూర్తిగా ఎమోషనల్‌గానే వుంటాయి. చాలామందికి నిజ జీవితంలో బ్రేక్ అప్ లవ్‌స్టోరీ వుంటుంది. ఆ లవ్‌స్టోరీలో వుండే చీకటి కోణాల్ని ఆవిష్కరించే ఆలోచనతో పుట్టిందీ సినిమా. అర్జున్‌రెడ్డి అనే యువకుడి కథే ఇది.
విజయ్ కోసమే..
ఈ కథను అనుకున్నపుడు ముందు శర్వానంద్‌కు వినిపించా. కానీ తనకు వేరే కమిట్‌మెంట్స్ వల్ల చేయలేదు. ఆ తరువాత విజయ్‌తో మాట్లాడి ఓకె చేశా. అప్పటికి ఇంకా పెళ్లిచూపులు సినిమా షూటింగ్ మొదలుకాలేదు. నేను అనుకున్నట్టు అర్జున్ రెడ్డి పాత్రలో విజయ్ అద్భుతంగా నటించాడు. తన నటనతో మరో స్థాయికి తీసుకెళ్లాడు.
వివాదాలు కాదు..
నిజానికి ఈ సినిమాలో లిప్‌లాక్ గురించి పోస్టర్లు వేశారంటూ బయట వివాదం రేగుతోంది. నిజానికి అంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇందులో ఎమోషనల్‌గానే లిప్‌లాక్ సన్నివేశాలు ఉంటాయి. ఎక్కడా వల్గారిటీ అనేది కనిపించదు. అది కూడా ఒక ఎమోషన్‌లాగానే చూపించాం.
స్ఫూర్తిగా అంటే?
ఈ కథకు స్ఫూర్తి నా జీవితంలో నా చుట్టూ జరిగిన సంఘటనల, వ్యక్తుల ఆధారంగా తెరకెక్కించాను. ఇక నాగురించి అంటారా.. నేను ఫిజియోథెరపీ చేశాను. మాది వరంగల్. తరువాత ఆస్ట్రేలియాలో ఫిలిం మేకింగ్‌లో పీజీ చేశాను. నాగార్జున కేడీ చిత్రానికి సహాయ దర్శకుడిగా పనిచేశా. అలాగే మళ్లీ మళ్లీ ఇది రాని రోజు సినిమాకు దర్శకుడు క్రాంతి దగ్గర స్క్రిప్ట్ సహాయకుడిగా పనిచేశా.

-యు