నాకు లైఫ్ ఛేజింగ్ ఫిల్మ్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెల్లంకొండ సాయిశ్రీనివాస్, రకుల్‌ప్రీత్‌సింగ్ జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిరియాల రవీందర్‌రెడ్డి నిర్మించిన ‘జయ జానకి నాయక’ చిత్రం ఇటీవలే విడుదలై సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో విజయోత్సవ సభను ఏర్పాటుచేశారు. కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం హీరో బెల్లంకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ- ఈ చిత్రాన్ని ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇది నా లైఫ్ ఛేంజింగ్ ఫిలిం. ఇంతమంచి అవకాశం ఇచ్చిన బోయపాటి శ్రీనుకు ప్రత్యేక కృతజ్ఞతలు. కథను నమ్మి ఇంత గ్రాండియర్‌గా తెరకెక్కించిన నిర్మాత రవీందర్‌రెడ్డి సపోర్టు మర్చిపోలేను అన్నారు. హీరోయిన్ రకుల్ మాట్లాడుతూ- ఈ సినిమాలో చేసిన జానకి పాత్ర నాకు చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా ప్రేక్షకులు తమ స్వంత మనిషిలా భావించి ఓన్ చేసుకున్నారు అన్నారు. బోయపాటి శ్రీను మాట్లాడుతూ- ప్రేక్షకులు ఇచ్చిన విజయానికి కృతజ్ఞతలు. ఈ సినిమాతో బెల్లంకొండ శ్రీనివాస్ మరోమెట్టుకెదిగాడు. ఆయన అలాగే కెరీర్‌లో మరిన్ని ఘనవిజయాలు సాధించాలి అన్నారు.