2న వెళ్లిపోమాకే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విష్వక్‌సేన్ హీరోగా యాకూబ్ అలీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘వెళ్లిపోమాకే’ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేస్తున్నారు. కొత్త నటీనటులు, టెక్నీషియన్లతో తెరకెక్కిన ఈ చిత్రానికి దిల్‌రాజు సపోర్టు చేయడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 2న విడుదలవుతున్న సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ- ఈ సినిమా మేకింగ్ అద్భుతంగా వుంది. మంచి ఫీల్ గుడ్ లవ్‌స్టోరీ. దర్శకుడు యాకూబ్ అలీ చక్కగా తెరకెక్కించాడు. నటీనటుల పెర్‌ఫామెన్స్ కూడా అద్భుతంగా వుంది. కొత్తవాళ్లతో కలిసి యాకూబ్ చేసిన ఈ ప్రయత్నం నన్ను ఆకట్టుకుంది. అందుకే ఈ సినిమాకు నా సపోర్టు అందిస్తున్నాను. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తయిన ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 2న విడుదల చేస్తున్నామన్నారు. దర్శకుడు యాకూబ్ అలీ మాట్లాడుతూ- రెండు సంవత్సరాల క్రితమే ఈ చిత్రాన్ని మొదలుపెట్టాం. నాకున్న బడ్జెట్ పరిమితులు వనరులతో చేసిన సినిమా. సినిమా చూసిన దిల్‌రాజు మాకు సపోర్టు అందించడం మర్చిపోలేని అనుభూతి. ఆయన విడుదల చేస్తుండడంతో సినిమాకు భారీ హైప్ వచ్చింది. తప్పకుండా ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది అన్నారు.