జోరు పెంచాడు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న పైసా వసూల్ చిత్రం విడుదలకు సిద్ధమైంది. సెప్టెంబర్ 1న విడుదలవుతున్న సందర్భంగా ప్రమోషన్‌లో స్పీడు పెంచాడు బాలయ్య. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్లు సంచలనం రేపుతున్నాయి. తేడాసింగ్ పాత్రలో బాలయ్య హంగామా మామూలుగా లేదు. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని భవ్య క్రియేషన్స్ పతాకంపై ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. శ్రీయ, ఖైరాదత్, ముస్కాన్ సేథ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన మరో సాంగ్‌ను తాజాగా విడుదల చేశారు. ఇప్పటికే నందమూరి అభిమానుల్లో భారీ అంచనాలు రేకెత్తించిన ఈ చిత్రం టైటిల్‌కు తగ్గట్లే బాలయ్య మరో హిట్‌ని వసూల్ చేస్తాడని అంటున్నారు. మరోవైపు సినిమాపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి బాలకృష్ణ 101 సినిమాగా తెరకెక్కుతున్న పైసా వసూల్ బాలయ్య కెరీర్‌లో మరో కొత్త సంచలనం రేపేలా ఉంది.