అంతర్జాతీయం

ప్రభుత్వాన్ని మూసేసైనా గోడ కడతా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్: అమెరికా పౌరుల భద్రతకు విఘాతం కలిగిస్తున్న పరిణామాలను అడ్డుకుంటానని, ఇందులో భాగంగా మెక్సికోతో ఉన్న సరిహద్దు పొడవునా గోడ కడతానంటూ డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను వ్యతిరేకించడం ద్వారా డెమోక్రాట్లు మొత్తం అమెరికా ప్రజల భద్రతనే ప్రమాదంలో పడేస్తున్నారని ఆయన అన్నారు. అక్రమ వలసలను అరికట్టడానికి మెక్సికో గోడ కట్టడం అన్నది అత్యంత కీలకమని ఇమ్మిగ్రేషన్ అధికారులే చెప్పిన విషయాన్ని ఆయన వెల్లడించారు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి అవసరమైతే ప్రభుత్వానే్న మూసేస్తానని, ఆ విధంగా దీనికి ఆమోదం తెచ్చుకోవడంతోపాటు నిధులనూ తెచ్చుకుంటానని అన్నారు. ఆరిజోనా రాష్ట్రంలోని ఫినిక్స్ పట్టణంలో జరిగిన అమెరికా పునరుత్థాన ర్యాలీలో మాట్లాడిన ట్రంప్ ప్రతిపక్ష డెమోక్రాట్లు వ్యవహరిస్తున్న తీరుని ప్రతిబంధక ధోరణిగా అభివర్ణించారు. ‘ఎట్టి పరిస్థితుల్లోనైనా వలసలను అడ్డుకోవడానికి మెక్సికో గోడ కడతా. కాని డెమోక్రాట్లు అడ్డుకుంటున్నారు, ఇందుకోసం ఎలాంటి చర్యనైనా తీసుకోవడానికి నేను సిద్ధం. అవసరమైతే ప్రభుత్వానే్న మూసేస్తా’ అని ట్రంప్ తెలిపారు. గత ఏడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఇచ్చిన వాగ్దానాల్లో మెక్సికో సరిహద్దు పొడవునా గోడ కట్టడం ఒకటి. ఇప్పుడీ వ్యవహారం అత్యంత కీలకంగా మారింది. ఇందుకు సంబంధించిన నిధుల బిల్లుపై కాంగ్రెస్ చర్చించబోతోంది. ఈ బిల్లు కనక ఆమోదం పొందకపోతే అక్టోబర్ 1న ప్రభుత్వమే స్తంభించిపోతుంది. ఈ నేపథ్యంలోనే ట్రంప్ తాజా హెచ్చరిక చేశారు. అమెరికా కాంగ్రెస్ తన బిల్లును బలపరచాలని, అక్రమ వలసలను నిరోధించాలని కోరారు. అయితే ఇందుకు అవసరమైన నిధులను అధికారి రిపబ్లికన్లు సమకూర్చుకోవాలంటే డెమ్రోక్రాట్లు మద్దతిచ్చితీరాలి. కాని ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఈ ప్రతిపాదనకు డెమోక్రాట్ల నుంచి మద్దతు లభించే అవకాశం కనిపించడం లేదు. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ మెక్సికో గోడను ఎలా కట్టాలన్న దానిపై అమెరికా దేశీయ భద్రతా విభాగం పలు డిజైన్లను పరిశీలించింది. కనీస పక్షంగా ఈ గోడ 18 అడుగుల ఎత్తు ఉండాలని, ఎరూ ఎక్కడానికి వీల్లేకుండా ఉండాలని, దాని అడుగున సొరంగం కూడా ఉండాలని మార్గదర్దేశనం చేసింది. అంతేగాకుండా అమెరికా నుంచి చూస్తే ఓ అద్భుమైన, అందమైన, ఆకర్షణీయమైన రీతిలో దీని నిర్మాణం ఉండాలని స్పష్టం చేసింది.
చిత్రం.. ఫోనిక్స్ కనె్వన్షన్ సెంటర్‌లో మాట్లాడుతున్న డొనాల్డ్ ట్రంప్