అంతర్జాతీయం

మీకు నిజాయితీ లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్: అమెరికా మీడియాపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా మండిపడ్డారు. మీడియాలో నిజాయితీ లోపించిందని, లాబీయింగ్ చేయటానికి మాత్రమే మీడియా ఉపయోగపడుతోందని ఆయన బుధవారం ఆరోపించారు. ఇటీవల వర్జీనియాలో తెల్లజాతీయుల ర్యాలీకి మీడియా పెద్దపీట వేయటాన్ని ట్రంప్ తప్పుపట్టారు. మీడియా తప్పుడు సమాచారాన్ని అధికంగా ప్రచారం చేస్తూ అమెరికాలో విభజన తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు. వర్జీనియాలో ఘర్షణలకు ఇరువర్గాలూ కారణమని వ్యాఖ్యానించిన మొదట్లో మాట్లాడిన ట్రంప్ ఇప్పుడు తన వైఖరిని మార్చుకున్నారు. అమెరికాలో ఎలాంటి వివక్షకు, విద్వేషానికి తావు లేదని ఆయన స్పష్టం చేశారు. అరిజోనా, ఫోనిక్స్ ప్రాంతాల్లో మంగళవారం జరిగిన ప్రచార తరహా ర్యాలీ నేపథ్యంలో న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్, సిఎన్‌ఎన్ వంటి సంస్థలపై నిప్పులు చెరిగారు.
‘వీళ్లు నిజంగా నిజాయితీ లేని మనుషులు. వాళ్లు మన దేశాన్ని ఇష్టపడటం లేదు. వాళ్లు చెడ్డవాళ్లు ఇదే నా అభిప్రాయం’ అని ఆయన వ్యాఖ్యానించారు. ‘వాళ్లు మన చరిత్రను, వారసత్వాన్ని వెనక్కి తీసుకుపోవాలని చూస్తున్నారు’ అని అన్నారు. ఈ మీడియా విద్వేష గ్రూపులకు అధిక ప్రాధాన్యమిస్తాయని, తప్పుడు వార్తలను ప్రచురిస్తాయని, ప్రసారం చేస్తాయని ఆయన ఆరోపించారు. వాషింగ్టన్ పోస్ట్ అమేజాన్‌కు లాబీయింగ్ చేయటానికి ఉపయోగపడుతోందన్నారు. అమెరికాను తిరిగి గొప్ప దేశంగా తీర్చిదిద్దటం ఈ మీడియాకు అస్సలు ఇష్టం లేదని కూడా ట్రంప్ విమర్శించారు. సదరు మీడియా ద్వంద్వ వైఖరితో వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. ‘మన వీధుల్లో ఓ ముఠా హింసాత్మక చర్యలకు పాల్పడుతుంటే వీళ్ల కళ్లు మూసుకుపోయాయి’ అని ఆయన అన్నారు. అదే సమయంలో ఫాక్స్ న్యూస్‌ను ట్రంప్ ప్రశంసించారు.