8న అబ్బాయి రాక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లరి నరేష్ తాజాగా నటిస్తున్న చిత్రం మేడమీద అబ్బా యి. జాహ్నవి ఫిలింస్ పతాకంపై జి.ప్రజీత్ దర్శకత్వంలో బొప్పన చంద్రశేఖర్ రూపొందించారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెప్టెంబర్ 8న విడుదకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంలో హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత మాట్లాడుతూ కొత్తదనంతో కూడిన కథతో అల్లరి నరేష్ మార్కు హాస్యంతో విభిన్నమైన చిత్రంగా రూపొందించామని, నరేష్ కెరీర్‌లో మైలురాయిలాఈ సినిమా నిలుస్తుందని తెలిపారు. గమ్యం, శివశంభో తర్వాత అంత సున్నితమైన కథతో నరేష్ నటించారని రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్‌గా రూపొందించిన ఈ సినిమాలో స్క్రీన్‌ప్లే హైలెట్‌గా వుంటుందని తెలిపారు. సహజమైన అంశాలతో సాగుతూ నరేష్ శైలి కామెడీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని, సెన్సార్ వారు అభినందనలతో క్లీన్ యు సర్ట్ఫికెట్ అందించారని తెలిపారు. అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలతో రూపొందిన ఈ సినిమాను వచ్చే నెల 8న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నామని అన్నారు. కార్యక్రమంలో జబర్‌దస్త్ ఆది తదితరులు పాల్గొని విశేషాలు తెలిపారు. నిఖిలా విమల్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో అవసరాల శ్రీనివాస్, జయప్రకాష్, తులసి, సుధ, సత్యం రాజేష్, మధునందన్, జబర్‌దస్త్ ఆది, పద్మ జయంతి, రవిప్రకాష్ ఇతర పాత్రల్లో నటించారు.