ప్రేమకు దర్పణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తనిష్క్‌రెడ్డి, అలెక్సియస్, సుబాంతి పంత్ హీరోహీరోయిన్లుగా వి. రామకృష్ణ దర్శకత్వంలో శ్రీ సిద్ది వినాయక ప్రొడక్షన్స్ పతాకంపై బి.ప్రవీణ్‌కుమార్ యాదవ్ నిర్మిస్తున్న దర్పణం చిత్రం శనివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. రచయిత పరచూరి వెంకటేశ్వరరావు క్లాప్ కొట్టగా దర్శకుడు ఎన్.శంకర్ కెమెరా స్విచాన్ చేసారు. ఈ కార్యక్రమంలో చిన్న శ్రీశైలం యాదవ్, ఎంఐ ఎం నాయకుడు నవీన్ యాదవ్, శివశక్తి దత్త, దర్శకుడు శ్రీనివాసరెడ్డి, కొమర వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మాత ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ ఇది మా మొదటి చిత్రం, కథ బాగా నచ్చింది, దర్శకుడు రామకృష్ణ చెప్పిన కథ కొత్తగా అనిపించింది, మంచి ప్రేమకథతో తెరకెక్కే ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి సింగిల్ షెడ్యూల్‌లో పూర్తి చేస్తాం అన్నారు. కాదంబరి కిరణ్ మాట్లాడుతూ సినిమా పరిశ్రమకు శ్రీశైలం యాదవ్ ఎంతో సపోర్టుగా ఉన్నారు, ఆయన ఇద్దరి కొడుకులు కూడా నాయకత్వం వహిస్తూ యువతకు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు, ప్రవీణ్‌కుమార్ నిర్మిస్తున్న చిత్రం మంచి విజయం కావాలి అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సిద్ధార్థ్, కెమెరా: సతీష్ ముత్యాల, ఎడిటింగ్: ఇఎస్ ఈశ్వర్, నిర్మాత: వి.ప్రవీణ్‌కుమార్ యాదవ్, దర్శకత్వం: వి.రామకృష్ణ.