మెగాస్టార్ మెచ్చిన శరభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆకాష్‌కుమార్, మిస్తీచక్రవర్తి జంటగా జయప్రద ప్రధాన పాత్రలో ఎన్.నరసింహరావు దర్శకత్వంలో అశ్వనీకుమార్ సహదేవ్ నిర్మిస్తున్న చిత్రం శరభ. ఈ చిత్రం ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్‌ను శనివారం మెగస్టార్ చిరంజీవి విడుదల చేసారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ఇంతకు ముందు జయప్రద వచ్చి ఈ సినిమా గురించి చెప్పింది, ఈ మధ్య నేను బయటకు ఎక్కువగా రావడంలేదు, ఆ విషయమై ఆమెకు చెబితే ఫస్ట్‌లుక్‌ను ఇక్కడే విడుదల చేద్దామని అన్నారు. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని క్లిప్పింగ్స్‌చూసాను. బాగా నచ్చాయి. జయప్రద, ఆకాష్ నటన బాగుం ది. దర్శకుడు నరసింహారావు అద్భుతంగా తెరకెక్కించాడు. ఇదొక ఫాంటసీ మూవీ. దేవుడు, దయ్యం మనిషి మధ్య జరిగే కథ ఇది అన్నారు. జయప్రద మాట్లాడుతూ శరభ కంటే ముందు తెలుగులో నాకు చాలా సినిమాల్లో అవకాశాలు వచ్చాయి, కానీ నటనకు స్కోపు వున్న పాత్ర చెయ్యాలని వెయిట్ చేసాను. అలాంటి సమయంలో నరసింహారావు ఈ కథతో నా దగ్గరికి వచ్చారు. నారోల్ అద్భుతంగా వుం టుం ది. చిరంజీవి ఈ సిని మా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేయ డం ఆనందంగా వుంది అన్నారు. దర్శకుడు నరసింహారావు మాట్లాడుతూ ఎన్నాళ్లుగానో దర్శకుడవ్వాలన్న కోరిక ఈ సినిమాతో తీరింది. ము ఖ్యంగా నా సినిమాకు చిరంజీవి సపోర్టు చేయడం ఆనందంగా వుంది, రివెంజ్ నేపథ్యంలో తెరకెక్కిన పక్కా కమర్షియల్ సోషియో ఫాంటసీ మూవీ ఇదని అన్నారు. ఈ చిత్రానిక సంగీతం: కోటి, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, నిర్మాత: అశ్వనీ కుమార్ సహదేవ్, రచన, దర్వకత్వం: ఎన్.నరసింహారావు.