వెంకి హిరణ్యకశిప?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గురు సినిమాలో విభిన్నమైన గెటప్‌తో నాచురాలిటీకి దగ్గరగా కనిపించి ఆకట్టుకున్నాడు ప్రముఖ నటుడు వెంకటేష్. ప్రస్తుతం ఆయన రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్‌లో కాకుండా భిన్నమైన పాత్రలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో వెంకటేష్ ఓ పౌరాణిక పాత్రలో నటించేందుకు ఓకే చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. ఆ వివరాలలోకి వెళితే ఈమధ్యే చారిత్రాత్మక నేపథ్యంలో రుద్రమదేవి చిత్రా న్ని తెరకెక్కించిన దర్శకుడు గుణశేఖర్ తన తదుపరి చిత్రంగా హిరణ్య కశిపుడు, భక్త ప్రహ్లాదుడి కథతో ఓ సిని మా తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే స్క్రిప్టు వర్క్ పూర్తయిన ఈ సినిమా కథను వెంకటేష్‌కు వినిపించారట. కథ నచ్చడంతో వెంకటేష్ ఆసక్తిగా వున్నట్టు తెలుస్తోంది. హిరణ్య కశిప పేరుతో తెరకెక్కే ఈ చిత్రంలో వెంకటేష్ హిరణ్య కశిపుడిగా నటిస్తాడని టాక్. మరోవైపు మిగతా నటీనటుల ఎంపిక కూడా జరుగుతోందట. మొత్తానికి కెరీర్‌లో ఇప్పటివరకు చేయని విధంగా వెంకటేష్ మొదటిసారి పౌరాణిక పాత్రల నటించేందుకు సిద్ధమయ్యాడు. మరి ఆయన ఈ పాత్రలో నటిస్తున్నట్టు వార్తలు రావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.