అదరగొట్టిన కుశ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న జై లవకుశ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి కావచ్చింది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ మూడు పాత్రల్లో నటిస్తున్నట్టు కన్‌ఫర్మ్ అయింది. వినాయకచవితి సందర్భంగా కుశ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసారు. దీంతో జై, లవకుమార్, కుశగా మూడు భిన్నమైన గెటప్‌లలో ఎన్టీఆర్ అదరగొట్టాడు. ఇందుల జై అనే పాత్రలో పూర్తిస్థాయి నెగిటివ్ షేడ్‌లో కనిపిస్తున్నాడు ఎన్టీఆర్. మొన్న విడుదలైన లవకుమార్ టీజర్ అప్పుడే మిలియన్ వ్యూస్ దాటి సంచలనం రేపుతోంది. త్వరలోనే కుశకు సంబంధించిన టీజర్‌ను కూడా విడుదల చేస్తారట. సెప్టెంబర్ 3న పాటల వేడుకను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రాశీఖన్నా, నివేదా థామస్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా బిజినెస్ కూడా సంచలనం రేపుతోంది. దసరా కానుకగా సెప్టెంబర్ 21నచిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.