రొమేనియాలో మహేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న స్పైడర్ సినిమా ప్రస్తుతం రొమేనియాలో మిగిలివున్న ఒక పాట చిత్రీకరణ జరుపుకుంటోంది. నిన్న చిత్రీకరణ మొదలుపెట్టిన యూనిట్ 31 వరకు జరపనుందట. క్రేజీ దర్శకుడు మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్‌సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే టాకీ పూర్తి చేసుకుని మరోవైపు పోస్ట్‌ప్రొడక్షన్ పనుల్లో బిజీగా వున్న ఈ సినిమాపై అంతటా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ట్రేడ్ వర్గాల్లో సంచలనం రేపుతున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఎన్‌వి ప్రసాద్, ఠాగూర్ మధు నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం దసరా కానుకగా సెప్టెంబర్ 27న భారీగా విడుదల కానుంది. దర్శకుడు ఎస్.జె.సూర్య ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు.