కళ్యాణ్‌రామ్‌తో జోడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్లామర్ హీరోయిన్‌గా సౌత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్న మిల్క్భీమ తమన్నాకు ఈమధ్య కెరీర్‌కు బ్రేక్ పడింది. వరసగా పరాజయాలు పలకరిస్తుండడంతో కొత్త అవకాశాలు రావడంలేదు. ముఖ్యంగా ఎన్నో ఆశలు పెట్టుకుని భారీ బడ్జెట్‌తో చేసిన అభినేత్రి సినిమా గట్టి దెబ్బ కొట్టడంతో తమన్నాకు ఈ పరిస్థితి. ప్రస్తుతం తమిళంలో ఒకే ఒక్క సినిమాలో నటిస్తున్న ఈమెకు తెలుగులో మరో అవకాశం వరించింది. నందమూరి కళ్యాణ్‌రామ్ హీరోగా నటించే సినిమాలో తమన్నా ఓకే అయిందట. ప్రస్తుతం ఎంఎల్‌ఏ చిత్రంలో నటిస్తున్న కళ్యాణ్‌రామ్ మరోవైపు జయేంద్ర దర్శకత్వంలో మరో చిత్రాన్ని మొదలుపెట్టారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా తమన్నాను ఎంపిక చేసారట. మరోవైపు కళ్యాణ్‌రామ్ ఎన్టీఆర్‌తో జై లవకుశ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. మరి కళ్యాణ్‌రామ్ సరసన అవకాశం పట్టేసిన తమన్నా ఈ సినిమాతో మళ్లీ తన హవాను చాటుకుంటుందేమో చూడాలి.