నిర్మాతగా మాధురి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్ లో 90వ దశకంలో హీరోయిన్‌గా ఒక ఊపు ఊపిన అందా ల భామ మాధురి దీక్షిత్ పెళ్లి చేసుకుని సినిమాలకు దూరం అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అడపాదడపా సినిమాల్లో నటిస్తున్న మాధురి ప్రస్తుతం నిర్మాతగా మారడానికి సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే ఆమె ఆర్.ఎన్.ఎం. మూవింగ్ పిక్చర్స్ అనే బ్యానర్‌ని స్థాపించారు. మొదటి ప్రయత్నంగా మరాఠీలో ఓ సినిమా తీయడానికి సిద్ధం అయింది. ఈ చిత్రాన్ని ప్రముఖ మరాఠి దర్శకుడు స్వప్న నీల్ జయకర్ దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉంటుందని, ఈ సినిమా తరువాత తాను హిందీ సినిమాలు కూడా నిర్మిస్తానని అంటోంది మాధురి. ఇప్పటికే బాలీవుడ్ అందాల భామలు ప్రియాంకా చోప్రా, అనుష్క శర్మల తరహాలో మాధురి కూడా నిర్మాతగా అడుగులు వేస్తోంది.