క్రిస్మస్ కానుకగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏసుక్రీస్తు జీవిత చరిత్రను కొత్త కోణంలో ఆవిష్కరించి ఆయన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు ఆధారంగా కొత్త అంశాలతో తెరకెక్కిస్తున్న చిత్రం లోకరక్షకుడు. చండ్రస్ ఆర్ట్ మూవీస్ పతాకంపై బ్రహ్మం సిహెచ్. దర్శకత్వంలో చంద్రశేఖర్ చండ్ర రూపొందించారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఇటీవల ఇంగ్లాండ్‌లో జరిపారు. సినిమా టైటిల్ లోగోను లండన్‌లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. త్వరలోనే సినిమాను ప్రేక్షకులముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాత చంద్రశేఖర్ మాట్లాడుతూ- అన్ని కార్యక్రమాలు ముగింపు దశలోఉన్నాయని, మొదటి షెడ్యూల్‌ను ఇండియాలోనూ, రెండో షెడ్యూల్‌లోను పలు అందమైన ప్రదేశాల్లో చిత్రీకరించామని, క్రిస్మస్ కానుకగా ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నామని తెలిపారు. భారతదేశంలో శాంతికి చిహ్నమైన గౌతమబుద్ధుడు, మహాత్మాగాంధీ లాంటివారు ప్రపంచ శాంతికి చేసిన మార్గనిర్దేశంలోనే ఏసుక్రీస్తు జీవితం సాగిందని, ఆయన ధర్మమార్గం సందేశం పలు వర్గాలలో పలు దేశాలలో శాంతిని నింపే విధంగా ఉన్నాయన్న కథనం ఈ సినిమాలో వుంటుందని తెలిపారు. సినిమాను ఎక్కడా రాజీపడకుండా నిర్మాత రూపొందించారని, లండన్ పార్లమెంట్‌లో విడుదల చేసిన లోకరక్షకుడు లోగోకు మంచి స్పందన వచ్చిందని, ఏసుక్రీస్తు జీవిత చరిత్రపై ఇదో మంచి సినిమా అవుతుందన్న నమ్మకం వుందని దర్శకుడు బ్రహ్మం. సిహెచ్ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: ఎ.కె.రిసాల్ సాయి, కెమెరా:జి.క్రిష్, రచన:డి.కృపాకర్, ఎడిటింగ్:నందమూరి హరి, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సిహెచ్.బ్రహ్మం.