రాత్రి షూటింగ్‌లో రామ్‌చరణ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ ప్రస్తుతం రంగస్థలం 1985 షూటింగ్‌లో బిజీగా వున్న సంగతి తెలిసిందే. 1985 కాలంనాటి కథగా రూపొందుతున్న ఈ సినిమాలో అన్ని దృశ్యాలు సహజంగాగానే ఉండాలనే ఉద్దేశ్యంతో దర్శకుడు సుకుమార్ షూటింగ్ చాలావరకు గోదావరి జిల్లాల్లోనే తీశారు. ఆ తర్వాత రామ్‌చరణ్, సమంతల బిజీ షెడ్యూల్స్‌వలన హైదరాబాద్‌లోనే విలేజ్, ఇసుక తినె్నలు కలిగిన నదీ తీరాలవద్ద సెట్స్‌వేసి చిత్రీకరణ జరుపుతున్నారు. ప్రస్తుతం రామ్‌చరణ్, సమంతలమీద నైట్ ఎఫెక్ట్‌లో సన్నివేశాలను రూపొందిస్తున్నారు. ఈ చిత్రీకరణలో జగపతిబాబు, ప్రకాష్‌రాజ్, ఆది పినిశెట్టి వంటి ఇతర ప్రధాన తారాగణం కూడా పాల్గొంటున్నారు. రామ్‌చరణ్ పూర్తి స్థాయి గ్రామీణ యువకుడిగా కనిపించనున్న ఈసినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను జనవరిలో విడుదల చేస్తారట.