ఒకే సంస్థ రెండు సినిమాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సితార ఎంటర్ టైన్ మెంట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకాలపై రెండు చిత్రాలు రూపొందనున్నాయ. నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. వివరాల్లోకెళితే చిన్న సినిమాలతో ట్రెండ్ సృష్టించిన మారుతి చేసిన బస్టాప్, ఈరోజుల్లో లాంటి చిన్న సినిమాలు పెద్ద విజయాలను అం దుకున్నాయి. ఆ తర్వాత నానితో భలే భలే మగాడివోయ్2తీసి భారీ బ్లాక్‌బస్టర్‌ను అందుకున్నారు. ప్రస్తుతం శర్వానంద్‌తో ఆయన చేస్తున్న మహానుభావుడు షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా తరువాత అక్కినేని నాగచైతన్యతో ఒక సినిమా చేసే యోచన లో ఉన్నాడట మారుతి. ప్రస్తుతం 3యుద్ధం శర ణం2విడుదల కోసం ఎదురుచూస్తున్న చైతు తర్వా త పెళ్లికోసం కాస్త బ్రేక్ తీసుకోనున్నాడు. ఆ బ్రేక్ తర్వాత మారుతి సినిమా ఉండొచ్చని ఫిల్మ్‌నగర్ టాక్. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం వుంది. భిన్నమైన కథలతో సినిమాలు చేస్తున్న హీరో శర్వానంద్, లేటెస్టుగా మరో భిన్నమైన సినిమాలో నటించేందుకు రెడీ అయ్యాడు. ప్రస్తుతం మారుతి దర్శకత్వం లో మహానుభావుడు చిత్రంలో నటిస్తున్న శర్వానంద్, నెక్స్ట్ మాఫియా డాన్‌గా నటిస్తాడట. ఆ వివరాల్లోకి వెళితే.. శర్వానంద్ నెక్స్ట్ స్వామిరారా ఫేం సుధీర్ వర్మ దర్శకత్వం లో సినిమాకు ఓకె చెప్పాడు. సుధీర్‌తో చేసే సినిమాలో మాఫియా డాన్‌గా కనిపిస్తాడని అంటున్నారు. ఒక సామాన్యుడు మాఫియా డాన్‌గా ఎలా ఎదిగాడనే కథతో ఈ సిని మా ఉంటుందని, ఇప్పటికే స్క్రిప్ట్‌వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే నెల లో సెట్స్‌పైకి రానుంది. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయ.