అందరూ బెస్ట్ లవర్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకరణ్, అమృత, ప్రీతి ప్రధాన తారాగణంగా నంది వెంకటరెడ్డి దర్శకత్వంలో రూపొందించిన చిత్రం 3బెస్ట్ లవర్స్2. నిర్మాత గొంటి శ్రీకాంత్ శ్రీకరణ్ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందించారు. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్నాయి. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- ప్రేమకు సరికొత్త నిర్వచనం తెలిపే ఈ సినిమాలో ప్రేమ గొప్పదనాన్ని చర్చించామని తెలిపారు. దర్శకుడు వెంకట్ వైవిధ్యమైన స్క్రీన్‌ప్లేతో తెరకెక్కించారని, సినిమా మొదటి సన్నివేశం నుండి చివరి సన్నివేశం వరకూ యువతకు నచ్చేలా తీర్చిదిద్దారని తెలిపారు. ప్రతి ప్రేమికుడు ప్రేమికురాలు చూడవలసిన చిత్రమిదని, మంచి పాటలు కుదిరాయని అన్నారు. త్వరలోనే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం:జి.సాయికిరణ్, కెమెరా:డి.యాదగిరి, నిర్మాత:శ్రీకాంత్ గొంటి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:నంది వెంకట్‌రెడ్డి.