2న వస్తున్న షాలిని 2

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వర్ణ ప్రొడక్షన్స్ పతాకంపై ఆమోగ్ దేశపతి, అర్చన, శ్రేయవ్యాస్ హీరో హీరోయిన్లుగా పార్సిల్ ఫేం షిరాజ్ దర్శకత్వంలో పి.వి.సత్యనారాయణ నిర్మించిన హారర్ థ్రిల్లర్ మరియు లవ్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీ చిత్రం షాలిని. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తిచేసకొని విడుదలకు సిద్ధమయిన సందర్భంగా యూనిట్ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా దర్శకుడు షిరాజ్ మాట్లాడుతూ- ఈ చిత్ర ట్రైలర్, పాటలు ఇటీవలే విడుదల చేశాము. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒక పల్లెటూరి నుంచి వచ్చిన యువతీ యువకులు సిటీకి వచ్చినపుడు వారిక్కడ ఎలాంటి సమస్యలను, భయాందోళనలను ఎదుర్కొన్నారు? వారిలో అసలు దెయ్యంగా ఉన్నది ఎవరు అనే ముఖ్య కథాంశంతో తెరకెక్కించాము. ఆడియెన్స్‌ను థ్రిల్‌కు గురిచేసే విధంగా ఉంటుంది కథ అంతా. సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాము అంటూ తెలిపారు. కన్నడలో హీరోగా నటిస్తున్న షిరాజ్ చెప్పిన కథ నాకు బాగా నచ్చడంతో షాలిని చిత్రాన్ని నిర్మించడానికి నిర్ణయించుకున్నా. ఈ సెప్టెంబర్ 2న ఆంధ్ర, తెలంగాణ అంతటా దాదాపు 80 నుంచి 100 థియేటర్స్ వరకు విడుదల చేయనున్నాము అని తెలిపారు నిర్మాత పి.వి.సత్యనారాయణ. ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూటర్స్ కోరిక మేర సెప్టెంబర్ 2న విడుదల చేయనున్నాము. చాలా భయపెట్టే చిత్రం ఈ షాలిని. ఇటీవలే వైజాగ్‌లో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించాము. మంచి రెస్పాన్స్ వచ్చింది అని అన్నారు.